‘బాణం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నారా రోహిత్. ఆ తర్వాత సోలో, రౌడీ ఫెల్లో, అసుర లాంటి విభిన్న సినిమాల్లో నటించాడు. కానీ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయాడు రోహిత్. ప్రస్తుతం నారా రోహిత్ సినిమా విషయంలో వెనకబడిపోయాడు. తాజా సమాచారం ప్రకారం నారా రోహిత్ ఎమ్మెల్యే అవతారం ఎత్తనున్నారట. రియల్ లైఫ్లో కాదండోయ్.. రీల్ లైఫ్లో.. అసలు విషయం ఎంటంటే నారా రోహిత్ ఓ సినిమాలో ఎమ్మెల్యేగా నటించబోతున్నట్లుగా సమాచారం.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్ను కూడా ప్రకటించింది చిత్రయూనిట్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో రోహిత్ ఎమ్మెల్యేగా నటించనున్నారట. ఇందులో రోహిత్ కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నట్లుగా టాక్. దీంతో ఈ సినిమాతో రోహిత్ మళ్ళీ ఫాంలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాలయ్య, బోయపాటి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో మరో కొత్త హీరోయిన్ను తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Also Read: