టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇటీవలే థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలకు అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇటీవల గత కొద్దిరోజులుగా చైతూ వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పలు రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన అనంతరం చైతూ పర్సనల్ లైఫ్ ఎప్పుడూ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే సమంత తాను ఆకస్మాత్తుగా ఎదురుపడితే హాయ్ చెబుతాను అని.. వృత్తిపరమైన జీవితం… పర్సనల్ లైఫ్ కు వేరు వేరుగా ప్రాధాన్యత ఇస్తానంటూ చైతూ చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి సోషల్ మీడియా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు చైతూ.
“నేను సోషల్ మీడియా నుంచి డిస్కనెక్ట్ అయ్యాను. నిజానికి నేను ఆన్లైన్లో చాలా బోరింగ్‌గా ఉంటాను. కానీ నా సినిమా విడుదలవుతున్నప్పుడు ఆ చిత్రం గురించి పోస్ట్ చేయడం కంటే ఎక్కువగా చదువేందుకు ఆసక్తి చూపిస్తాను. అంటే ఇంటర్వ్యూలు,. ప్రతిచర్యలు చదివుతుంటాను. రెండింటిని ముడిపెట్టను. అందులో చాలా విషపూరితమైనవి ఉన్నాయి. వాటిని ఫిల్టర్ చేసి మంచిది ఏది.. చెడు ఏది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుర్తించలేకపోతే సోషల్ మీడియా మనకు మంచిది కాదు. మిమ్మల్ని ఇది చెడు మార్గంలో తీసుకెళ్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం మానసిక ఆరోగ్యానికి మంచిది అని అన్నారు చైతూ.