‘బంగార్రాజు’ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. మరోసారి వారసులతో నటించనున్న నాగ్.. షూటింగ్ ఎప్పుడంటే..

|

May 19, 2021 | 8:52 PM

'మనం' తర్వాత.. అక్కినేని ఫ్యామిలీ మరోసారి కలిసి నటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం.. నాగ్ ఫ్యామిలీ అంతా దాని గురించే ప్రిపేర్ అవుతోంది.

బంగార్రాజు ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. మరోసారి వారసులతో నటించనున్న నాగ్.. షూటింగ్ ఎప్పుడంటే..
Nagarjuna
Follow us on

‘మనం’ తర్వాత.. అక్కినేని ఫ్యామిలీ మరోసారి కలిసి నటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం.. నాగ్ ఫ్యామిలీ అంతా దాని గురించే ప్రిపేర్ అవుతోంది. అదే నాగర్జున గతంలో నటించిన సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ గా వస్తున్న బంగార్రాజు మూవీ స్టోరీని అందుకు తగ్గట్లుగా రూపొందిస్తున్నారు. అన్ని కేరెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తూ.. అలాగే కొద్దిగా మసాలా కూడా యాడ్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇదే కాదండోయ్ ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.

కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చాలాకాలం తర్వాత నాగార్జున కు హిట్ అందించిన ఈ మూవీగా నిలిచింది. తెలుగునాట సంక్రాంతి స్పెషల్ గా వచ్చి.. హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని.. అప్పట్లోనే డైరెక్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీపై సరికొత్త అప్ డేట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎప్పటినుంచో అఖిల్ కు హిట్ అందించాలని అనుకుంటున్న నాగ్.. అందుకు ఈ మూవీనే సెలెక్ట్ చేశాడట. ఇటీవలే ఈ విషయంలో కాస్త క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ మన్మథుడు.. ఇక స్టోరీని తన ఫ్యామిలీకి అనుకూలంగా తీర్చిదిద్దేలా తయారు చేయాలని.. డైరెక్టర్ కు సూచించినట్లుగా సమాచారం. దీంతో దర్శకుడు కల్యాణ్ కృష్ణ ప్రస్తుతం అదే పనిలో పడ్డాడు. ఇప్పటికే నాగ్ తో పాటూ అక్కినేని వారసులు చైతు, అఖిల్ నటించనున్న ఈ సినిమాలో.. చైతన్యకు జోడీగా సమంత నటిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కలిసి నటించిన ఏ మాయ చేశావే, మనం, మజిలీ వంటి సినిమాల్లో ఈ హిట్ పెయిర్ గా నిలిచారు.. తాజాగా మరోసారి వీరిద్దరు బంగార్రాజు సినిమాలో కూడా స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నట్లుగా టాక్. వీరి కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్నీ హిట్ కావడంతో.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం లేకపోలేదు. జూన్‌ లేదా జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‏న్యూస్.. కోమరం భీం గురించి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్..

వాళ్ళకే మీరు సాయం చేస్తారా ? నెటిజన్ ప్రశ్నకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్.. పొలిటిషియన్‏ను కాదంటూ ఫైర్..