Akkineni Naga Chaitanya: నిన్న మొన్నటివరకు మోస్ట్ లవ్వబుల్ కపుల్ గా పేరుతెచ్చుకున్న సమంత- నాగచైతన్య సడన్‌గా విడిపోతున్నాం అంటూ అనౌన్స్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చాలా కాలంగా మీడియాలో నడుస్తున్న టాక్ అయినప్పటికీ.. ఒక్కసారిగా విడాకులు అనౌన్స్ చేయడంతో అభిమానులంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక విడిపోయిన తర్వాత ఇద్దరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సామ్ వరుస పోస్ట్‌లతో అభిమానులను పలకరిస్తుంది. ఇక నాగచైతన్య కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరయ్యాడు చైతన్య. విడాకుల తర్వాత మొదటిసారి అభిమానుల ముందుకు వచ్చిన నాగచైతన్య ఏం మాట్లాడుతారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు..
చైతూ మాట్లాడుతూ.. రోజులు మారుతున్నాయి.. పరిస్థితులు మారుతున్నాయి. కానీ మీ ఎనర్జీ మాత్రం అస్సలు మారదు అంటూ తన స్పీచ్ ను మొదలుపెట్టాడు. అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న చైతన్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ గురించి మాట్లాడాడు. అలాగేఅఖిల్ గురించి మాట్లాడుతూ.. ఒక సినిమా రిజల్ట్ కంటే దాని కోసం జరిగే ప్రాసెస్ ని ఎక్కువగా ప్రేమిస్తాడు. అఖిల్ లో నాకు బాగా నచ్చేది అదే. అఖిల్ మైండ్ లో చాలా రన్ అవుతూ ఉంటాయి. రానున్న ఐదారేళ్లలో ఎలాంటి కథలు చేయాలి.. ఎలాంటి పాత్రలు చేయాలనేది అఖిల్ మైండులో ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. అఖిల్ కు ఆ డెడికేషన్ ఉంది. అఖిల్ కెరియర్ ను స్టార్ట్ చేసి ఐదేళ్లు ఐదేళ్ళుఅయింది. ప్రతి ఏడాది ఇంట్లో నేను ఒక కొత్త అఖిల్ ను చూస్తుంటాను. తన ఫిజిక్ ను .. బాడీ లాంగ్వేజ్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాడు. నాకు అఖిల్ సిసింద్రీలో చిన్న పిల్లాడిలానే కనిపిస్తున్నాడు. అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఇక ఈ ఈవెంట్ లో చైతు కాస్త డల్ గానే కనిపించాడని చెప్పాలి.. చైతన్య మాటల్లోనూ అది కనిపించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :