అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడ్డాడు. ఈ జంట గతఏడాది పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. అలాగే ఈ పెళ్ళికి పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ సహా పలువురు హాజరయ్యారు. పెళ్లి తర్వాత ఈ జంట పలు టెంపుల్స్ కు కూడా వెళ్లారు. నాగార్జునతో కలిసి కొత్త పెళ్లికూతురు పెళ్ళికొడుకు శోభిత, చైతన్య పలు ఆలయాలను దర్శించుకున్నారు.
ఇక ఈ జంట పెళ్లైన తర్వాత తో సంక్రాంతిని సంబరంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫోటోలను శోభిత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో శోభిత పొంగల్ సెలబ్రేషన్స్ ఫోటోలను పంచుకుంది. భోగిమంటతో పాటు ముగ్గులు వేసిన ఫోటోలను పంచుకుంటూ.. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫొటోల్లో శోభిత సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసింది.
ఇక నాగ చైతన్య శోభిత కంటే ముందు సమంతను పెళ్లాడిన విషయం తెలిసిందే. మనస్పర్థల కారణంగా ఈ ఇద్దరూ విడిపోయారు. సామ్ తో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డారు చై. వీరి వివాహం డిసెంబర్ లో జరిగింది. నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి