S. Thaman : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెల్సిందే.. వినాయక చవితి రోజున సాయి ధరమ్ తేజ్ మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. రోడ్డు పై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‌ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంలో తేజ్ షోల్డర్ బోన్ విరగడంతో సర్జరీ చేశారు అపోలో వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
తాజాగా సంగీత దర్శకుడు తమన్ మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. అపోలో లో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని.. మన ప్రార్ధనలు ఫలిస్తున్నాయని తెలిపారు.. ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని అన్నారు తమన్. అలాగే త్వరలో తేజ్‌ను కలవనున్నట్టు తెలిపారు తమన్. నా మిత్రుడిని కలవడానికి చాలా ఆసక్తికి ఎదురుచూస్తున్నా.. త్వరలోనే సాయి ని కలుస్తా అంటూ ట్వీటర్ ద్వార తెలిపారు తమన్. ఇక తేజ్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6నుంచి 10 నెలలు పెట్టె అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాను అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. దర్శకుడు దేవ కట్టా ‘రిపబ్లిక్’ సినిమాను రూపొందించాడు. భగవాన్ – పుల్లారావు నిర్మించిన ఈ సినిమా, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా నటించింది.
All your prayers are working ❤️
My nanban @IamSaiDharamTej is recovering ❤️? So well thanks @bkrsatish for the update . I am so excited to meet mY dear nanban in couple of days ⭐️#GetWellSoonSDT love u Nanba?— thaman S (@MusicThaman) September 30, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :