Raghu Kunche : చక్రి మంచితనమే తనను చంపేసింది.. చివరి రోజుల్లో ఎంత నరకయాతన ఉండేదంటే.. రఘు కుంచె..

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు చక్రి. దాదాపు 85 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించారు. ఆయన తన కెరీర్‌లో మెలోడీ , మాస్ సాంగ్స్‌తో ఒక ప్రత్యేక ముద్ర వేశారు. పూరి జగన్నాథ్‌తో చక్రికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన చాలా సినిమాలు మ్యూజికల్ హిట్‌లుగా నిలిచాయి.

Raghu Kunche : చక్రి మంచితనమే తనను చంపేసింది.. చివరి రోజుల్లో ఎంత నరకయాతన ఉండేదంటే.. రఘు కుంచె..
Chakri, Raghu Kunche

Updated on: Apr 01, 2026 | 8:24 PM

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి అకాల మరణంపై దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న పుకార్లను, నిరాధార ఆరోపణలను తోటి సంగీత దర్శకుడు రఘు కుంచె తాజాగా ఖండించారు. చక్రి అద్భుతమైన వ్యక్తిత్వం గలవారని, ఆయన మరణానికి ప్రధాన కారణాలు ఆరోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్లేనని స్పష్టం చేశారు. రఘు కుంచె మాటల్లో, చక్రి కార్యాలయం ఒక “సత్రం” లా ఉండేదని, రోజూ 30 నుంచి 50 మంది వరకు అక్కడ భోజనం చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఎవరొచ్చినా సరే, వారి ఆకలి తీర్చకుండా పంపించేవారు కాదని, అటువంటి దాతృత్వం గల వ్యక్తిని తన జీవితంలో చూడలేదని ఆయన పేర్కొన్నారు. చక్రి మరణానంతరం ఆయనపై “అధికంగా మద్యం సేవించి మరణించారు” అనే నిందలు వేశారని, ఇప్పటికీ అవి ప్రచారంలో ఉన్నాయని రఘు కుంచె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని, చక్రి ఆరోగ్య సమస్యలకు కారణం అతని తీవ్రమైన పని ఒత్తిడి, ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, ఆహార నియంత్రణ లేకపోవడమేనని తేల్చి చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Throwback Movie : 1996లో బాక్సాఫీస్‍ను షేక్ చేసిన సినిమా.. కోటి రూపాయాలతో తీస్తే 11 కోట్ల కలెక్షన్స్..

నిరంతరం సినిమాలు చేస్తూ, నిద్రలేమితో బాధపడటం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతిందని వివరించారు. చక్రి “ఫుడ్ లవర్” అని, చివరి దశలో శరీరం చాలా బరువుగా మారిందని, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని రఘు కుంచె వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Babu Mohan : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయన లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. బాబు మోహన్ కామెంట్స్..

రెండు అడుగులు వేయడానికే ఆయాసం వచ్చే స్థితికి చేరుకున్నారని, చికిత్సకు కూడా ఆయన శరీరం సహకరించని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. “ఆ మంచితనమే, అందరినీ ఆదరించాలనే గుణమే, నిద్ర లేని పనే అతన్ని చంపేసిందని” రఘు కుంచె భావోద్వేగంగా పేర్కొన్నారు. అనవసరమైన విషయాలపై ఒత్తిడి పెంచుకోవద్దని, షుగర్, బీపీ, హార్ట్ అటాక్‌లకు స్ట్రెస్సే ప్రధాన కారణమని ఆయన హితవు పలికారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.9 కోట్లతో తీస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను షేక్ చేసిన తమిళ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..

Follow Us