Chiru153: అభిమానులు సిద్ధంగా ఉండండి.. మెగాస్టార్ బర్త్ డేకు అదిరిపోయే అప్డేట్ రానుంది..

|

Aug 21, 2021 | 6:57 AM

మెగాస్టార్ .. ఆ పేరు ఒక సంచలనం, ఆ పేరు ఒక ప్రభంజనం. తెలుగు తెరపై ఆయన స్టైల్, ఆయన నటన, ఆయన డాన్స్లు...ఈ తరం కుర్రహీరోలకు ఇంస్ప్రెషన్. మెగా స్టార్ సినిమా వస్తుందంటే..

Chiru153: అభిమానులు సిద్ధంగా ఉండండి.. మెగాస్టార్ బర్త్ డేకు అదిరిపోయే అప్డేట్ రానుంది..
Chiru
Follow us on

Chiru153: మెగాస్టార్ .. ఆ పేరు ఒక సంచలనం, ఆ పేరు ఒక ప్రభంజనం. తెలుగు తెరపై ఆయన స్టైల్, ఆయన నటన, ఆయన డాన్స్లు…ఈ తరం కుర్రహీరోలకు ఇంస్ప్రెషన్. మెగా స్టార్ సినిమా వస్తుందంటే అభిమానుల ఆనందం మాములుగా ఉండదు. అదే ఆయన పుట్టిన రోజు అయితే ఇక అభిమానులకు పండగే . కటౌట్లు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, రక్త దానం, అన్నదానం అంటూ ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆ మధ్య మెగాస్టార్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు అభిమానులంతా కొంత నిరాశకు గురయ్యారు. కానీ అభిమానుల కోరిక మేరకు చిరంజీవి రెట్టింపు ఉత్సాహంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో సూపర హిట్ అందుకున్నారు. రీఎంట్రీ తర్వాత చిరంజీవి జోరు పెంచారు. వరుసగా సినిమాలు లైన్‌లో పెడుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహ రెడ్డి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న చిరు. ఇప్పుడు ఆచార్యగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటం విశేషం

ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్ ఆయన లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు చిరు.  ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ రానుందని తెలుస్తుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక  అభిమానుల అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వదిలారు. రేపు( ఆగస్టు 22) సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. దాంతో మెగాస్టార్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

Andamaina Lokam: ఆకట్టుకునే ప్రేమ కథతో రానున్న అందమైన లోకం.. త్వరలోనే రెగ్యులర్ షూట్

Honey Trapping: బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. పిచ్చెక్కి తిరిగే కుర్రబ్యాచ్‌ బీ-కేర్‌ఫుల్.. వల్లో పడ్డారా ఇక అంతే..