Chiranjeevi: మరో తమిళ రీమేక్‌పై కన్నేసిన మెగాస్టార్‌… సరైన దర్శకుడి కోసం వేట మొదలు పెట్టిన చిరు?

|

Aug 31, 2021 | 6:40 AM

Chiranjeevi: ఖైదీ నెంబర్‌ 150తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి దూకుడు మీద ఉన్నారు. సైరా నర్సింహా రెడ్డి తర్వాత చాలా గ్యాప్‌ ఇచ్చిన మెగాస్టార్‌...

Chiranjeevi: మరో తమిళ రీమేక్‌పై కన్నేసిన మెగాస్టార్‌... సరైన దర్శకుడి కోసం వేట మొదలు పెట్టిన చిరు?
Follow us on

Chiranjeevi: ఖైదీ నెంబర్‌ 150తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి దూకుడు మీద ఉన్నారు. సైరా నర్సింహా రెడ్డి తర్వాత చాలా గ్యాప్‌ ఇచ్చిన మెగాస్టార్‌ ఆ గ్యాప్‌ను పూడ్చడానికే అన్నట్లు బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలకు సైన్‌ చేస్తూ అభిమానుల్లో జోష్‌ను పెంచారు. ప్రస్తుతం ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన చిరు.. అనంతరం లూసిఫర్‌ రీమేక్‌ గాడ్‌ ఫాదర్‌లో నటించనున్నారు. దీని తర్వాత కూడా చిరు.. మరో రీమేక్‌ను చేయనున్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో వేదాళమ్‌ రీమేక్‌లో నటిచంనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేయనున్నాడు.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి మరో రీమేక్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళంలో అజిత్‌ హీరోగా నటించిన యెన్నై అరిందల్‌ సినిమాపై ప్రస్తుతం చిరు మనసు పడ్డట్లు తెలుస్తోంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో క్రిమినల్‌ కేసు నుంచి ఓ యువతిని కాపాడే మాజీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తాడు. ఇక చిరు ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ మంచి దర్శకుడిని వెతికే పనిలో పడ్డట్లు సమాచారం.

ఈ సినిమాను సొంత బ్యాన‌ర్ కొణిదెల ప్రొడ‌క్షన్స్ హౌజ్ పై రామ్‌ చరణ్‌ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. ఐదు సినిమాలతో చిరు అభిమానుల్లో జోష్‌ని పెంచేశారని చెప్పాలి.

Also Read: టైటానిక్ హీరో ఆప్గాన్‌లో అగ్గి రాజేశాడు.. ఆ నిప్పు మళ్లీ ఇప్పుడు రాజుకుంటుంది.. ఏం చేశాడంటే..

Nikhil Siddhartha: మరోసారి ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో నిఖిల్.. అవేశాన్ని.. ఆక్రోశాన్ని అణిచివేయకుండా అంటూ..

Jacqueline Fernandez: బాలీవుడ్ సెలబ్రెటీలకు బిగుస్తున్న మనీలాండరింగ్ కేసు.. స్టార్ హీరోయిన్‏కు చెమటలు పట్టించిన ఈడీ..