Varun Tej’s Ghani: బాక్సాఫీస్ రింగ్‌లోకి దిగడానికి సిద్దమైన మెగాహీరో.. గని ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

|

Feb 15, 2022 | 3:31 PM

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గని. కిరణ్ కొర్రుపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.

Varun Tejs Ghani: బాక్సాఫీస్ రింగ్‌లోకి దిగడానికి సిద్దమైన మెగాహీరో.. గని ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..
Gani
Follow us on

Varun Tej’s Ghani: మెగా హీరో వరుణ్ తేజ్(Mega hero Varun Tej )నటిస్తున్న లేటెస్ట్ మూవీ గని( Ghani ). కిరణ్ కొర్రుపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ మెగా హీరో.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఆతర్వాత కంచె, ఫిదా, లోఫర్, తొలిప్రేమ, ఎఫ్ 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్. ఇక ఇప్పుడు గనిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. అల్లు బాబీ కంపెనీ,  సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా వచ్చిన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరిని ఆకట్టుకుంది.

దబాంగ్ 3 బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. పంచ్ బ్యాగ్ ను చాలా ఫోర్స్ గా వరుణ్ కొడుతున్నట్టు ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. అయితే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాను కూడా ఫిబ్రవరి 25నే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో వరుణ్ తేజ్ గని రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో భీమ్లానాయక్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepika Pilli: దీపికా పిల్లి అందాల విందు మామూలుగా లేదుగా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి.. అందం, అభినయం కలబోసిన ఈ సీతాకోకచిలుక ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..

Manchu Vishnu: ఏపీ సీఎం జగన్‏తో భేటీ కానున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. సినీ పరిశ్రమ సమస్యలపై..