సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార (Sitara Ghattamaneni) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నవయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి భారీగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది. సింగింగ్, డ్యా్న్సింగ్, పెయింటింగ్ వీడియోస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటుంది సితార. అంతేకాకుండా.. ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన వెకేషన్స్, చిన్నారులకు అవసరమైన వీడియోస్ షేర్ చేస్తుంది. ఇటీవల సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ ప్రమోషన్ వీడియోలో డ్యాన్స్‌తో అదరగొట్టింది. అలాగే ఇటీవల శ్రీరామనవమికి కూచిపూడి నృత్యంతో అభిమానులను మంత్రముగ్దులను చేసింది. మల్టీటాలెంటెడ్ గర్ల్‌గా పేరు సంపాదించుకుంది సితార. తాజాగా తాను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్లుగా వీడియోను షేర్ చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఇద్దరూ గుర్రపు స్వారీలో ప్రావీణ్యం ఉన్నవారన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి సినిమాలో గుర్రపు స్వారీలు చేసిన సన్నివేశాలున్నాయి. తాజాగా వారిద్దరి బాటలోనే నడుస్తోంది మహేష్ గారాలపట్టి సితార. తాను గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న వీడియోను షేర్ చేస్తూ తన ట్రైనర్స్‌కు థ్యాంక్స్ చెప్పింది. ” టిల్‌బెర్రీ, బెర్టా అనే రెండు అత్యంత అందమైన, బలమైన, దయగల గుర్రాలపై నాకు గుర్రపు స్వారీ నేర్పించిన నా గురువులు మరియా, రోన్యాలకు ధన్యవాదాలు! నా గుర్రపు స్వారీ అనుభవాన్ని మీకు చూపించడానికి వేచి ఉండలేను” అంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో సితారతోపాటు.. మహేష్ తనయుడు గౌతమ్ సైతం కనిపిస్తున్నాడు. గౌతమ్, సితార ఇద్దరూ గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.