Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుంచి స్పెషల్ అప్డేట్.. చివరి దశలో షూటింగ్.. మాస్ సాంగ్‏తో ఫైనల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata).

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుంచి స్పెషల్ అప్డేట్.. చివరి దశలో షూటింగ్.. మాస్ సాంగ్‏తో ఫైనల్..
Mahesh Babu

Updated on: Apr 19, 2022 | 2:44 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. షూటింగ్‏లో బాగంగా ఒక మాస్ సాంగ్ ని భారీ సెట్‏లో చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ప్రస్తుతం ఈ మూవీలోని రెండు పాటలు విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచాయి.

ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్ , డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్న ఈ పాట మాస్ సాంగ్‏గా ఉండబోతుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ లో భాగంగా యూనిట్ లొకేషన్ స్టిల్స్‏ని విడుదల చేశారు. కాళ్ళకి రెడ్ కర్ట్చీప్ కట్టుకొని మహేష్ చాలా మాస్‏గా ఇందులో కనిపించారు. ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ భారీ సెట్‌ని వేశారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‏గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read: Alia- Ranbir wedding: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన అలియా రణబీర్ ల వైరల్ అవుతున్న

ఫొటోస్..

Acharya: మెగా అభిమానులకు కనుల పండువ.. అన్న కోసం తమ్ముడు.. ఒకే వేదికపై మెగా హీరోల సందడి..

Nagabhushanam: అసాధారణమైన నటనా కౌశల్యం.. విలనీజానికి కొత్త భాష్యం చెప్పిన విలక్షణ నటుడు నాగభూషణం

‘Archery’: ఆర్చరీ షూటింగ్ ప్రారంభం.. ముగ్గురు బాలీవుడ్ నట వారసులు బీ టౌన్‌లో ఎంట్రీ

Follow Us