
తెలుగు సాహిత్యాన్ని చదివేవారికి ప్రముఖ రచయిత మధుబాబుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రాసిన ‘షాడో’ నవలలు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించాయి. ఈ నవల్స్ ను విపరీతీంగా అభిమానిస్తారు సాహితీ జనాలు. అవి ఇప్పుడు దృశ్యరూపంలోకి మారబోతున్నాయి. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర వీటిని వెబ్ సిరీస్‌గా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ‘మధుబాబు షాడో’ పేరుతో వీటిని తెరకెక్కించనున్నారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్సిమెంట్ చేశారు.
ఈ సిరీస్‌లో ఓ ప్రముఖ హీరో నటిస్తారని సమాచారం. ఇప్పటికే ఓ ఓటీటీ సంస్థతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నటీనటుల్ని అనౌన్స్ చేసి, ఈ ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.