Maa Elections 2021: మా ఎన్నికల హీట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్..

|

Oct 04, 2021 | 2:55 PM

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు రోజు రోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఈ నెల 10న ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం

Maa Elections 2021: మా ఎన్నికల హీట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్..
Srikanth
Follow us on

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు రోజు రోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఈ నెల 10న ఎన్నికలు జరగనుండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరివురు తమ ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్స్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఇక ఇప్పటికే నువ్వా, నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తూ.. ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా.. తమ ప్యానల్ సభ్యులతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ప్రకాష్ రాజ్.. తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. మా అభివృద్ధి ప్రకాష్ రాజ్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు.

అలాగే.. కొంతమంది కావాలనే.. సినీ పరిశ్రమలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారని.. తెలుగు వాళ్లకంటే మిగతా పరిశ్రమల్లో వారికే గౌరవం ఉందని తెలిపారు. తాము మా అసోసియేషన్ కోసం ఎంత చేసినప్పటికీ తమపై కొందరు బురద చల్లుతున్నారని తెలిపారు. అందుకే ఈసారి ఎన్నికల్లో తను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని.. కానీ ఆరు నెలల క్రితం ప్రకాష్ రాజ్ తనను కలిసి.. తన ప్రణాళిక గురించి వివరించారని తెలిపారు. మా అభివృద్ధి ఆయన వల్లే సాధ్యమవుతుందని శ్రీకాంత్ అన్నారు. పోటీ చేయాలని ఆయన అడగడం వల్లే తాను ఈసారి పోటీ చేస్తున్నానని.. గత ఎన్నికల్లో తాను ఓడిపోలేదని.. కావాలనే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. అందుకే ఓటమి పాలైన చోట కసితో పనిచేద్దామని నిర్ణయించుకున్నానని చెప్పారు. అలాగే.. మా బిల్డింగ్ కలను ప్రకాష్ రాజ్ పూర్తిచేస్తారని చెప్పుకొచ్చారు.

Also Read: Naga Chaitanya: ‘ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌’.. నాగచైతన్య ట్వీట్.!

MAA Elections 2021: ఆసక్తికరంగా ‘మా’ ప్రచారం.. రెబల్ స్టార్‌ను కలిసిన మంచు విష్ణు.. ఆశీస్సులంటూ..

Prakash Raj: సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా.? మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజు సెటైర్లు