
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు శివాజీ మరో కీలక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న లెనిన్ సినిమా శుక్రవారం (జులై 10) న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు అఖిల్. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదే క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అఖిల్ టాలీవుడ్ హీరోలతో తనకున్న అనుబంధం గురించి ఓపెన్ గా మాట్లాడాడు. ‘నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ. సినిమా ఇండస్ట్రీలో హీరో నితిన్ నాకు మంచి ఫ్రెండ్. అతనే నా ఫస్ట్ సినిమాను కూడా నిర్మించాడు. ఇక రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య. అర్ధరాత్రి కూడా ఫోన్ చేసేంత క్లోజ్. ఇక నా ఫేవరెట్ యాక్టర్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెబుతాను. ఆయన నటించిన పోకిరి సినిమా ఎన్ని సార్లు చూశానో గుర్తు లేదు’ అని చెప్పుకొచ్చారు అఖిల్.
ఇదే క్రమంలో తన తండ్రి, హీరో అక్కినేని నాగార్జున గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు అఖిల్. ‘ నా రియల్ హీరో, ఇన్ స్పిరిషేన్ నాన్ననే. ఆయన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి ఆశ్చర్యపోతుంటాను. ఇక అమ్మా నేను మంచి ఫ్రెండ్స్ లా ఉంటాం. నా బిగ్గెస్ట్ సపోర్టర్ తనే. నేను ఎక్కడున్నా రోజూ ఒకసారైనా అమ్మతో మాట్లాడుతూ. ఇక నాగ చైతన్య ఎప్పుడూ డామినేటింగ్ బ్రదర్ లా ఉండడు. మా ఇద్దరి ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ట్రిప్స్, వెకేషన్లకు వెళుతంటాం’ అని అఖిల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
The Charm, The Energy & The Star Presence. ❤️🔥
Hero #AkhilAkkineni lit up the #Lenin Meet & Greet with his electrifying presence and unforgettable moments with fans. 🔥
Get Exclusive Updates Of Akhil Akkineni Here 🔗 https://t.co/kAdpXdskED
Event by @shreyasgroup ✌️… pic.twitter.com/W4gmy8X77D
— Shreyas Media (@shreyasgroup) July 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి