Actor Vivek: సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి.. తండ్రి జ్ఞాపకంగా ఏం చేశారంటే..

2021లో గుండెపోటుతో వివేక్ మృతి చెందారు. ఆయన మరణం కోలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. ఎప్పటికీ తనదైన నటనతో కడుపుబ్బా నవ్వించిన వివేక్ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని సినీ ప్రముఖులు అన్నారు. ఈ క్రమంలోనే మార్చి 28న వివేక్ కూతురు తేజస్విని వివాహం భరత్ అనే వ్యక్తితో జరిగింది. నిన్న చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్ లోని చిన్న కలైవారన్ రోడ్ లో గల వివేక్ నివాసం అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంతో సింపుల్‏గా జరిగింది.

Actor Vivek: సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి.. తండ్రి జ్ఞాపకంగా ఏం చేశారంటే..
Vivek

Updated on: Mar 29, 2024 | 12:33 PM

కోలీవుడ్ కమెడియన్ దివంగత నటుడు వివేక్ గురించి పరిచయం అవసరం లేదు. తనదైన నటనతో.. కామెడీ టైమింగ్‏తో ప్రేక్షకులను నవ్వించాడు. తమిళంలో అనేక సినిమాల్లో నటించిన ఆయనకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. అపరిచితుడు, రాఘువరన్ బీటెక్, శివాజీ, బాయ్స్, ఖుషీ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2021లో గుండెపోటుతో వివేక్ మృతి చెందారు. ఆయన మరణం కోలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. ఎప్పటికీ తనదైన నటనతో కడుపుబ్బా నవ్వించిన వివేక్ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని సినీ ప్రముఖులు అన్నారు. ఈ క్రమంలోనే మార్చి 28న వివేక్ కూతురు తేజస్విని వివాహం భరత్ అనే వ్యక్తితో జరిగింది. నిన్న చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్ లోని చిన్న కలైవారన్ రోడ్ లో గల వివేక్ నివాసం అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంతో సింపుల్‏గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

పెళ్లి అనంతరం తన తండ్రి జ్ఞాపకంగా వివేక్ కుమార్తే తేజస్విని.. ఆమె భర్త భరత్ మొక్కలు నాటారు. తన తండ్రి కల కోసం ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటినట్లు తెలిపారు తేజస్విని. అలాగే వివాహానికి హాజరైన అతిథులకు మొక్కలు పంపిణి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. అభిమానులు ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

Vivek Daughter

వెండితెరపై తన నటనతో అలరించిన వివేక్.. నిజ జీవితంలో చాలామందికి రోల్ మోడల్. అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని వివేక్ లక్షలాది మొక్కలు నాటారు. నిరంతరం మొక్కలు నాటుతూ ప్రకృతిని కాపాడాలంటూ తన అభిమానులకు పిలుపునిచ్చేవారు. కానీ అనుహ్యంగా వివేక్ 2021లో కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణం అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us