
Bangarraju: కింగ్ నాగరాజున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో సోగ్గాడే చిన్నినాయనా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు మూవీ రానుంది. ఈ సినిమాలో నాగార్జున తోపాటు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నాగార్జున సరసన సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బంగార్రాజు సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. తాజాగా కృతి శెట్టి లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది కృతి శెట్టి. నాగలక్ష్మి లుక్ ను నాగచైతన్య తన సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. అచ్చమైన పల్లెటూరి పిల్లలా.. మేడలో పూలమాలతో కళ్లజోడును స్టైలుగా పట్టుకున్న కృతి లుక్ ను రిలీజ్ చేశారు. కృతి ఈ పోస్టర్ లో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో చలపతి రావు.. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :