నమ్మినవాళ్ళే మోసం చేశారు.. వారిలో ప్రేమ కనిపించలేదు..! సిల్క్ స్మిత చివరి ఉత్తరంలో సంచలన విషయాలు

కొంతమంది సినీ హీరోయిన్స్ జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది. కాస్ట్లీ కారులు, బ్రాడెడ్ బట్టలు, కోట్లు ఖరీదు చేసే ఇళ్లు , ఖరీదైన వాచ్ లు వాడుతుంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.

నమ్మినవాళ్ళే మోసం చేశారు.. వారిలో ప్రేమ కనిపించలేదు..! సిల్క్ స్మిత చివరి ఉత్తరంలో సంచలన విషయాలు
Silk Smitha

Updated on: Sep 23, 2026 | 4:53 PM

ఒకప్పుడు ఆమె తెరపై కనిపిస్తే చాలు.. థియేటర్లలో సందడి మొదలయ్యేది. ఆమె పాటకు కుర్రకారు ఫిదా అయ్యేవారు. ఆమె చూపులకు, డాన్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. దక్షిణాది సినీ పరిశ్రమలో గ్లామర్‌కు ఓ కొత్త నిర్వచనం తీసుకొచ్చిన ఆ నటి పేరు సిల్క్ స్మిత. అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. కొద్ది కాలంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నారు. కానీ తెరపై కనిపించిన ఆ వెలుగు వెనుక ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో నిండిపోయింది. 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో సిల్క్ స్మిత మృతి చెందడం అప్పట్లో సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం ఆత్మహత్యగా నమోదు కాగా.. దానికి దారితీసిన పరిస్థితులపై మాత్రం సంవత్సరాలు గడిచినా చర్చ కొనసాగుతూనే ఉంది.

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?

సిల్క్ స్మిత మరణానికి ముందు రాసినట్లు చెబుతూ సోషల్ మీడియాలో, వివిధ కథనాల్లో ఓ లేఖ చాలా కాలంగా చక్కర్లు కొడుతోంది. అందులో తనను నమ్మినవారు మోసం చేశారని, తన చుట్టూ ఉన్నవారిలో నిజమైన ప్రేమ కనిపించలేదని ఆమె బాధపడినట్లు రాసుకొచ్చారు. ఆ లేఖలో ఆర్థిక వ్యవహారాలు, ఆస్తులు, తనను నమ్మిన వ్యక్తుల వల్ల ఎదురైన మోసం, జీవితంపై విసుగు వంటి అంశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తనకు అత్యంత సన్నిహితులైన కొందరిపైనే ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ ఉత్తరంలో ఉంది. 1960 డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు ప్రాంతంలో జన్మించిన విజయలక్ష్మి.. తర్వాత సినీ ప్రేక్షకులకు సిల్క్ స్మితగా పరిచయమయ్యారు. పేదరికం కారణంగా చిన్న వయసులోనే చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఆమె మేకప్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత నటిగా అవకాశాలు అందుకున్నారు. 1979లో వచ్చిన తమిళ చిత్రం ‘వండిచక్కరం’ ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ సినిమాలో ఆమె పోషించిన ‘సిల్క్’ పాత్రే తర్వాత ఆమెకు ‘సిల్క్ స్మిత’ అనే పేరును తీసుకొచ్చింది.

ఆ హీరోతో నటించడం నాకు ఇష్టం లేదు.. అందుకే ఒక్క సినిమాకూడా చేయలేదు..

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆమె నటించారు. ప్రత్యేకంగా గ్లామర్ పాత్రలు, డ్యాన్స్ నంబర్లతో ఆమెకు భారీగా క్రేజ్ వచ్చింది. అప్పటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమెకు ప్రత్యేకమైన పాట లేదా పాత్ర ఉంటే ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేవారు. దాదాపు రెండు దశాబ్దాలకు చేరువైన కెరీర్‌లో 450కి పైగా చిత్రాల్లో నటించారు సిల్క్ స్మిత. అప్పటి సినీ పరిశ్రమలో ఆమెకు ఎక్కువగా గ్లామర్, డ్యాన్స్, బోల్డ్ పాత్రలే రావడంతో అదే ఆమెకు శాశ్వత ఇమేజ్‌గా మారిపోయింది. నటిగా మంచి స్థాయికి చేరుకున్న తర్వాత సిల్క్ స్మిత నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. నిర్మాతగా చేసిన ప్రయత్నాలు మాత్రం ఆమెకు ఆర్థికంగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.  1996 సెప్టెంబర్ 22 రాత్రి సిల్క్ స్మిత తనకు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాల్సి ఉందంటూ నటి అనురాధను సంప్రదించినట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో సిల్క్ స్మిత మృతిచెందారు. ఆమె వయసు అప్పటికి కేవలం 35 సంవత్సరాలు. ఆమె మరణాన్ని ఆత్మహత్యగా నమోదు చేశారు. అలాగే ఆమె నివాసంలో ఒక సూసైడ్ నోట్ లభించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. అయితే ఆ నోట్‌కు సంబంధించిన పూర్తి విషయాలు, దాని వివరణపై సంవత్సరాలుగా భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్‌తో నాకు గట్టిపోటీ ఉండేది.. ఇద్దరం తగ్గేవాళ్లం కాదు..! మీనా సెన్సేషనల్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us