
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అంతేకాదు అప్పట్లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్.. ఈ ముగ్గురు హీరోలకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది. ఈహీరోలకు ఆమె లక్కీ ఛార్మ్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ? తను మరెవరో కాదండి. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో హోమ్లీ నటిగా, నటనకు ప్రాణం పోసే కథానాయికగా చెరగని ముద్ర వేసుకున్న అందాల తార భూమిక. పంజాబీ కుటుంబంలో జన్మించిన భూమిక మోడలింగ్ రంగం ద్వారా సినీ కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పలు యాడ్స్ చేసింది. ఆ తర్వాత ప్రకటనల్లో మెరిసి వెండితెర ప్రవేశానికి బాటలు వేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్‌లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?
అక్కినేని సుమంత్ హీరోగా వచ్చిన సినిమా యువకుడు. ఈ మూవీతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన భూమిక.. ఫస్ట్ మూవీతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ ఆమె కెరీర్ మార్చేసింది. దీంతో స్టార్ డమ్ అందుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు జోడిగా భూమిక నటించిన ఒక్కడు సినిమా.. ఎన్టీఆర్ సరసన సింహాద్రి చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది. అప్పట్లో భూమిక టాలీవుడ్ లక్కీ హీరోయిన్, గోల్డెన్ లెగ్ అనే పేర్లను సంపాదించుకుంది. తెలుగులో వాసు, మిస్సమ్మ, అనసూయ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషలలో నటించి మెప్పించింది. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన తేరే నామ్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వదినగా, అక్కగా నటిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..