
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న డ్యాన్సర్ ఆమె. ముఖ్యంగా తన గ్లామరస్ లుక్స్, బ్రేక్ డ్యాన్స్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఆకట్టుకునే డ్యాన్స్ కదలికలతో అప్పట్లో యావత్ దక్షిణాది చిత్రసీమను ఏలింది. నటిగానే కాకుండా నెంబర్ వన్ డ్యాన్సర్ గానూ పాపులర్ అయ్యింది. ఒకప్పుడు ఆమెను డ్యాన్స్ క్వీన్ అని పిలిచుకునేవారు. మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడి మరీ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కేవలం 14 ఏళ్ల సినిమా ప్రయాణంలో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ కెరీర్ సక్సెస్ అయినప్పటికీ తన రియల్ లైఫ్ మాత్రం ఊహించినంత అందంగా సాగలేకపోయింది. మొదట కూతురిని పోగొట్టుకుంది. ఆ తర్వాత భర్తను కోల్పోయి తీవ్ర నిరాశలో కుంగిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధల నుంచి కోలుకుంటుంది. ఆమె మరెవరో కాదు.. డాన్స్ క్వీన్ డిస్కో శాంతి.
డిస్కో శాంతి.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డ్యాన్సర్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. అసలు పేరు శాంత కుమారి. 1965లో మద్రాసులో జన్మించారు. ప్రముఖ నటుడు సి.ఎల్ ఆనందన్ కుమార్తె. చిన్నప్పటి నుంచే నటన, డ్యాన్స్ పై ఎక్కువగా ఆసక్తి ఉండేది. 1983లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత, కేవలం 14 సంవత్సరాల కెరీర్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఒరియా భాషలలో కలిపి దాదాపు 900లకు పైగా చిత్రాల్లో నటించింది. ఆమె తెరపై కనిపించగానే ఈలలు, చప్పట్లతో థియేటర్లు మారుమోగేవి. అంతగా తన డ్యాన్స్, గ్లామర్ లుక్స్ తో వెండితెరపై మ్యాజిక్ చేసింది.
Disco Shanti Fam
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే 1996లో తెలుగు నటుడు శ్రీహరిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె జన్మించారు. అయితే నాలుగు నెలల వయసులోనే కుమార్తె మరణించింది. ఆమె జ్ఞాపకంగా అక్షర ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లల విద్య, సాంకేతిక రంగం కోసం పనిచేశారు. కుటుంబంతో సంతోషంగా ఉన్న సమయంలోనే 2013లో తన భర్త శ్రీహరి ఆకస్మాత్తుగా మరణించారు. భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయిన డిస్కో శాంతి చాలా కాలంపాటు ఒంటరిగా గడిపింది. ఇప్పుడిప్పుడే తన ఆ బాధ నుంచి కోలుకుంటున్నట్లు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..