Keerthy Suresh : మెగాస్టార్ సిస్టర్‌‌‌‌గా మహేష్ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా..? ఫిలిం సర్కిల్స్‌‌‌లో జోరుగా జరుగుతున్న ప్రచారం..

|

Aug 06, 2021 | 9:16 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో  తెరక్కుతోన్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు చిరు...

Keerthy Suresh : మెగాస్టార్ సిస్టర్‌‌‌‌గా మహేష్ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా..? ఫిలిం సర్కిల్స్‌‌‌లో జోరుగా జరుగుతున్న ప్రచారం..
Keerthy Suresh
Follow us on

Keerthy Suresh : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌‌‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో  తెరక్కుతోన్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు చిరు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మలయాళ రీమేక్ లూసిఫర్ సినిమా పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాలో చాలా మార్పులు చేర్పులు జరిగినట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం హీరోయిన్ పాత్రను కూడా సృష్టించారట. ఒరిజినల్ లో అసలు హీరోయిన్ పాత్ర ఉండదు. అలాగే ఈ  సినిమాతో పాటే తమిళ్ రీమేక్ వేదాళం సినిమాను కూడా రీమేక్ చేయనున్నారు మెగాస్టార్. అజిత్ నటించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రీమేక్ మూవీని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలిగా నటించే హీరోయిన్ గురించి చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వేదాళం సినిమాలో చెల్లెలు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ పాత్రే సినిమాను మలుపు తిప్పుతుంది. హీరోకు సరిసమానంగా సాగే ఆపాత్రలో ఎవరు నటించనున్నారని విషయం పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే చిరు సిస్టర్ రోల్ కోసం సాయి పల్లవి – కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ఎక్కువగా వినిపించాయి. కీర్తి సురేష్ అయితేనే మెగాస్టార్ సిస్టర్ రోల్‌‌‌కి బాగుంటుందని భావించిన మెహర్ రమేష్..ఆమెను ఒప్పించేందుకు నానా తిప్పలు పడ్డట్టు తెలుస్తోంది. మొత్తానికి కీర్తిసురేష్ ను ఒప్పించారట మెహర్ రమేష్. ఇందుకోసం అమ్మడు రెమ్యునరేషన్ కూడా అందుకుంది టాక్. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajasekhar: విలన్‌‌‌‌గా మారనున్న సీనియర్ యాక్టర్.. ఆ హీరో సినిమాలో ప్రతినాయకుడిగా రాజశేఖర్..

పరమ్ సుందరి అంటూ అదరగొట్టిన చిన్నారి.. కృతిసనన్‌‌‌‌ను దించేసిన క్యూటీ.. నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉంటరామరి..

Tuck Jagadish: మళ్లీ ఓటీటీ వైపు టక్ జగదీశ్ చూపు..!! థియేటర్లు ఓపెన్‌ అయినా అంతగా కనిపించని జనం.. వీడియో