Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్.. ఇంతకీ ఏముందీ మూవీలో!

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన 'డోరతీ' చిత్రం విడుదలైనప్పటి నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంటోంది. సినిమాలోని నటీనటులు చాలా సహజంగా నటించారని ప్రశంసలు వస్తున్నా కంటెంట్ పరంగా ఈ మూవీ తీవ్ర విమర్శలు అందుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపులు కూడా వచ్చాయి.

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్.. ఇంతకీ ఏముందీ మూవీలో!
Dorothy Movie

Updated on: Sep 26, 2026 | 10:08 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘డోరతీ’ చిత్రం విడుదలైనప్పటి నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంటోంది. ఈ చిత్రంలో మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కనిపించింది. ఒకవైపు, సినిమాలోని వాస్తవిక కథనం ప్రశంసలు అందుకుంటుండగా, మరోవైపు LGBTQ సమస్యలను చిత్రీకరించిన తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఈ చిత్రాన్ని బహిష్కరించాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ ఒక ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘డోరతీ’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు మొదటి నుంచి మిశ్రమ సమీక్షలు వస్తున్నాయి. సినిమా మొదటి భాగం నెమ్మదిగా సాగినా, కథ బలంగా ఉందని ప్రేక్షకులు అన్నారు. కీర్తి సురేష్ నటన నిడివి తక్కువగా ఉన్నా ప్రభావవంతంగా ఉంది. సింగిల్ షాట్ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాక్‌లను అద్భుతంగా చిత్రీకరించారు. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాకు గొప్ప ఊపునిచ్చిందని క్రిటిక్స్ అంటున్నారు.

మరోవైపు, సోషల్ మీడియాలో డోరతీ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో LGBTQ అంశాన్ని తప్పుగా చిత్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి. దీని కారణంగా, చాలా మంది ప్రేక్షకులు కార్తీక్ సుబ్బరాజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఇద్దరు పురుషులు ముద్దు పెట్టుకునే సన్నివేశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇందులో హద్దులు దాటిన అడల్ట్ కంటెంట్ ఉందని కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగా ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో #BoycottDorothy అనే హ్యాష్‌ ట్యాగ్‌ బాగా ట్రెండ్ అవుతోంది. సాధారణ ప్రజలపై ఇలాంటి విషయాలను బలవంతంగా రుద్దడాన్ని నెటిజన్లు విమర్శించారు. అందులో నూ ఓ ప్రముఖ దర్శకుడి నుండి ఇలాంటి సినిమాను తాము ఊహించలేదని చాలామంది కార్తీక్ సుబ్బరాజును తప్పుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

 ఎక్స్ (ట్విట్టర్) లో ట్రెండ్ అవుతోన్న #BoycottDorothy హ్యాష్ ట్యాగ్..

‘డోరతీ’ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us