Krithi Shetty : ఆ హీరోకి నో చెప్పిన ఉప్పెన బ్యూటీ.. కృతి వద్దనుకున్న సినిమాను కీర్తి ఓకే చేసిందా..

తక్కువ టైమ్ లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ కృతి శెట్టి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. బూచి బాబు సానా దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.

Krithi Shetty : ఆ హీరోకి నో చెప్పిన ఉప్పెన బ్యూటీ..  కృతి వద్దనుకున్న సినిమాను కీర్తి ఓకే చేసిందా..
Keerthy Suresh Krithi Shet
Follow us

|

Updated on: Apr 03, 2022 | 9:51 PM

తక్కువ టైమ్ లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty )ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఉప్పెన సినిమలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఎగిసిపడ్డాయి. ఇటీవలే నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన వారియర్ సినిమాలో నటిస్తుంది. అలాగే సుధీర్ బాబు హీరోగా వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలోనూ నటిస్తుంది. అలాగే ఈ చిన్నదానికి తమిళ్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి. కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య డైరెక్టర్ బాల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.

తాజాగా ఈ  బ్యూటీకి మరో క్రేజీ అఫర్ వచ్చిందట. కానీ  ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. హీరో శర్వానంద్ కృష్ణచైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శర్వా ఓ బిడ్డకు తండ్రిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో శర్వాకు జోడీగా కృతిని అనుకున్నారట. ఓ బిడ్డకు తల్లి పాత్రకావడంతో ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని టాక్ వినిపిస్తుంది. కెరీర్ బిగినింగ్ లోనే తల్లి పాత్రలు చేయనని కృతి శెట్టి చెప్పడంతో ఆ ఛాన్స్ అందాల భామ కీర్తి సురేష్ కు దక్కిందట. కీర్తిసురేష్ ఇటీవల చెల్లెలి పాత్రలు, తల్లి పాత్రలు చేయడానికి వెనకాడటం లేదు. చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చెల్లెలి పాత్రల్లో కనిపించనుంది. అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే సినిమాలో సిస్టర్ పాత్రలో నటించింది. ఇక పెంగ్విన్ సినిమాలో ఒక బిడ్డకి తల్లిగా కనిపించింది. ఇప్పుడు శర్వానంద్ సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా కనిపించనుందట. మొత్తానికి కృతి వద్దనుకున్న సినిమాను కీర్తి ఓకే చేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja: మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన టైగర్‌ నాగేశ్వరరావు.. త్వరలోనే షూటింగ్..

Vikrant Rona: మెగాస్టార్స్‌ చేతుల మీదుగా విడుదలైన కిచ్చా సుదీప్‌ సినిమా టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌..

Ugadi 2022 Telugu: శుభకృత్‌ అన్నీ శుభాలే జరగాలని ఉగాది శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, అజయ్ దేవగన్ సహా..పలువురు సెలబ్రెటీలు

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్