Kathi Mahesh Death : కత్తి మహేష్ మరణ వార్తతో షాక్‌కు గురయ్యాను : మంచు మనోజ్

ప్రముఖ సినీ క్రిటిక్, దర్శకుడు కత్తి మహేష్ కనుమూశారు. గత నెల 26 న నెల్లూరు జిల్లా లో రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ గాయపడ్డారు. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

Kathi Mahesh Death : కత్తి మహేష్ మరణ వార్తతో షాక్‌కు గురయ్యాను : మంచు మనోజ్

Edited By:

Updated on: Jul 10, 2021 | 6:39 PM

ప్రముఖ సినీ క్రిటిక్, దర్శకుడు కత్తి మహేష్ కనుమూశారు. గత నెల 26 న నెల్లూరు జిల్లా లో రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ముందు సీట్లో ఉన్న మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరగగానే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వలేదు.. దాంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మహేష్ స్నేహితుడు సురేష్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే  నెల్లూరు లోని ప్రయివేటు ఆస్పత్రికి కత్తి మహేష్ తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో చెన్నై అపోలోకి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మహేష్ కన్నుమూశారు. కత్తి మహేశ్ మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరో మంచు మనోజ్ కత్తి మహేష్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు.  ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో మహేష్ ఫోటోను షేర్ చేసి.. కత్తి మహేశ్‌ మరణ వార్త తనను షాక్‌కు, ఆవేదనకు గురిచేసిందని మంచు మనోజ్‌ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్రకటించారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us