Raja Vikramarka: ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజా విక్రమార్క.. రేపే అసలైన స్పెషల్… అదేంటంటే..

యాక్షన్ ప్లస్ కామెడీతో నయా ఏజెంట్ విక్రమ్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు కార్తికేయ. ఇటీవల చావు కబురు చల్లగా

Raja Vikramarka: ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజా విక్రమార్క.. రేపే అసలైన స్పెషల్... అదేంటంటే..
Raja Vikramrka

Updated on: Nov 05, 2021 | 6:14 PM

యాక్షన్ ప్లస్ కామెడీతో నయా ఏజెంట్ విక్రమ్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు కార్తికేయ. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి డీలా పడిపోయిన హీరో ఇప్పుడు రాజా విక్రమార్కగా రాబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. రాజా విక్రమార్క సినిమా ప్రేక్షకుల ముందు రాబోతున్న సమయం దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్.. సినిమా పై క్యూరియాసిటీని పెంచేసింది.

హోమంత్రికి ముప్పు అంటే బాధ్యత నాది.. ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి.. అంటూ సుధాకర్ కోమాకుల చెప్తున్న డైలాగ్స్ ఆసక్తిని కలిగించగా.. తనికెళ్ల భరణి.. కార్తికేయ మధ్య జరిగే సన్నివేశాలు కాస్త కామెడితో ట్రైలర్ ఇంట్రస్టింగ్ కలిగించింది.  ఈ నేపథ్యంలోనే రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ ఈవెంట్‏ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్స షేర్ చేసింది చిత్రయూనిట్. ఫిల్మ్ నగర్‏లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్‏లో రేపు (నవంబర్ 6న) సాయంత్రం 6 గంటలకు జరగునున్నట్లుగా తెలిపారు. ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ట్వీట్..

Also Read: Samantha: సమంత కొత్త గోల్స్… తన కొత్త ఆస్తి అదేనంటున్న ముద్దుగుమ్మ.. పోస్ట్ వైరల్..

Puneeth RajKumar: పునీత్ రాజ్ కుమార్‏కు సూర్య నివాళి.. అప్పు సమాధిని చూసి హీరో ఎమోషనల్..

RajiniKanth: తలైవా క్రేజ్ మాములుగా లేదు.. రజినీ సినిమా కోసం ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us