Yash : డాన్స్‌తో అదరగొట్టిన యశ్.. తండ్రి స్టెప్పులకు మురిసిపోయిన రాకింగ్ స్టార్ కూతురు

|

Nov 04, 2024 | 10:59 AM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సినిమాతో యశ్ కు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Yash : డాన్స్‌తో అదరగొట్టిన యశ్.. తండ్రి స్టెప్పులకు మురిసిపోయిన రాకింగ్ స్టార్ కూతురు
Yash
Follow us on

రాకింగ్ స్టార్ స్టార్ యశ్ ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడు. అంతకు ముందు కేవలం కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించిన యశ్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సినిమాతో యశ్ కు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కేజీఎఫ్ సినిమా తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా కూడా భారీ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే యశ్ సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా కావాల్సినంత టైం ఇస్తూ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడు.

ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

యశ్ సతీమణి కూడా హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.. ఆమె రాధికా పండిట్.. కన్నడ భాషలో పలు సినిమాలు చేసిన రాధికా .. యశ్ తోనూ నటించారు. ప్రస్తుతం రాధికా సినిమాలకు దూరంగా ఉంటూ  ఫ్యామిలీతో బిజీగా గడుపుతున్నారు. కాగా యశ్ కు సంబందించిన ఫోటోలను ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది రాధికా.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

తాజాగా యశ్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యశ్ ఓ ఈవెంట్ లో డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. యశ్ ఓ ఫ్యామిలీ వేడుకలో డాన్స్ ఫ్లోర్ పై ఇరగదీశాడు. అదిరిపోయే స్టెప్పులతో కుమ్మేశాడు. యశ్ డాన్స్ చేస్తుంటే అతని కూతురు అవాక్ అయ్యింది. తన డాడీ డాన్స్ కు ఫిదా అయ్యిన ఆ చిన్నారి .. యశ్ డాన్స్ తరవాత తాను కూడా స్టెప్పులేసి ఆకట్టుకుంది. కూతురు డాన్స్ చూసి యశ్ మురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యశ్ సతీమణి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.