Toxic Movie: ఓ మహిళకు భర్తగా యశ్ కూడా గౌరవం చూపాలి.. ‘టాక్సిక్‌’ పై ప్రముఖ హీరోయిన్ విమర్శలు

రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సిక్ కంటెంట్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉందని ప్రశంసలు వస్తుంటే మరోవైపు సినిమాలో బోల్డ్ సీన్స్, హింస మోతాదుకు మించి ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.

Toxic Movie:  ఓ మహిళకు భర్తగా యశ్ కూడా గౌరవం చూపాలి.. టాక్సిక్‌ పై ప్రముఖ హీరోయిన్ విమర్శలు
Toxic Movie

Updated on: Aug 13, 2026 | 5:50 PM

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్ .. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. మలయాళం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కంటెంట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఇటీవల రిలీజైన టాక్సిక్ ట్రైలర్ కు యూట్యూబ్ లో సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ టాక్సిక్ మూవీ కంటెంట్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యశ్ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందని ప్రశంసలు వస్తున్నప్పటికీ ఈ మూవీలో బోల్డ్ సీన్స్, హింస మోతాదుకు మించి ఉన్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. అంతకు ముందు కియారా బోల్డ్ సాంగ్ పై కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకే చెందిన ప్రముఖ నటి రిషికా సింగ్ టాక్సిక్ సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ మూవీ ట్రైలర్ లో చూపించిన బోల్డ్ సీన్స్ పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘యశ్ టాక్సిక్ ట్రైలర్‌లో చూపించిన రొమాంటిక్, బోల్డ్ సీన్స్ నన్ను తీవ్ర నిరాశకు గురి చేశాయి. యశ్ కూడా ఓ భర్తగా, తండ్రిగా మహిళల పట్ల గౌరవం చూపాలని ఆశిస్తున్నాను. మహిళలను గౌరవించకపోతే ఆయనను కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తాం’ అంటూ హెచ్చరించింది రిషికా సింగ్. చివరగా ‘నేను కూడా టాక్సిక్’ అంటూ కామెంట్స్ చేసింది. దీంతో రిషికా కామెంట్లపై యశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె విమర్శలను తిప్పికొడుతున్నారు. అదే సమయంలో రిషికా గతంలో నటించిన సినిమాలు, ఫొటోషూట్స్ లోని బోల్డ్ క్లిప్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Toxic Movie, Rishika Singh

ఇదిలా ఉంటే టాక్సిక్ సినిమా కేవలం పెద్దల కోసమేనని ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లు గా నటించనున్నారు. అలాగే అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ సహా పలువురు విదేశీ నటీనటులు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టాక్సిక్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us