
నటుడు ధ్రువ సర్జా దంపతులు కరోనాపై పోరాటం చేసి విజయం సాధించారు. ఈ విషయాన్ని వారు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాజాగా చేసిన టెస్టుల్లో తనతో పాటు తన సతీమణి ప్రేరణకు నెగిటివ్ వచ్చినట్లు తెలిపాడు ధ్రువ. క్లిష్ట సమయంలో తమకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు సహా అభిమానులకు ధన్యావాదాలు తెలిపాడు. అంతేకాదు వారిద్దరికీ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సుర్జిత్ పాల్ సింగ్, అతడి టీమ్ కు థ్యాంక్స్ చెప్పాడు. కాగా ప్రముఖ హీరో అర్జున్ సర్జా మేనల్లుడే ధ్రువ సర్జా.
కాగా ఇటీవల అర్జున్ కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్ కూడా కరోనా బారిన పడ్డారు. ఐశ్వర్య ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతోంది. కన్నడ చిత్రం ‘పొగరు’లో హీరోగా నటించాడు ధ్రువ. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. కాగా ధ్రువ సోదరుడు, హీరో చిరంజీవి సర్జా ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే.