Thalaivi Movie : ఆకట్టుకుంటున్న తలైవి రొమాంటిక్ పోస్టర్.. జయలలిత-ఎంజీఆర్ అప్పట్లో ఇలా..

| Edited By: Ram Naramaneni

Aug 25, 2021 | 9:04 AM

దివంగత నేత, సినీనటి జయలలిత జీవిత కథ ఆధారంగా  తెరకెక్కుతున్న సినిమా తలైవి. ఈ సినిమా జయలలిత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తున్న విషయం తెల్సిందే.

Thalaivi Movie : ఆకట్టుకుంటున్న తలైవి రొమాంటిక్ పోస్టర్.. జయలలిత-ఎంజీఆర్ అప్పట్లో ఇలా..
Thalaivi
Follow us on

Thalaivi Movie : దివంగత నేత, సినీనటి జయలలిత జీవిత కథ ఆధారంగా  తెరకెక్కుతున్న సినిమా తలైవి. ఈ సినిమా జయలలిత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తున్న విషయం తెల్సిందే. అలాగే ఎంజీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. తమిళనాడు ఎలక్షన్స్‌కు ముందే తలైవి రిలీజ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్‌. అయితే కరోనా కారణంగా షూటింగ్ డిలే కావటం.. ఆ తరువాత కూడా రిలీజ్‌కు అనువైన పరిస్థితులు లేకపొవటంతో వాయిదా పడుతూ వచ్చింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం.. వరుసగా ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధిస్తుండటంతో ‘తలైవి’ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అప్పట్లో చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్‌ 10వ తేదీన థియేటర్‌లోకి రానుందని చిత్ర బృందం ప్రకటించింది. “తలైవి ప్రతి మలుపులో శాశ్వత అనుభవాలతో విస్తృతమైన ప్రయాణం చేశాం. దేశవ్యాప్తంగా థియేటర్లు తిరిగి తెరుస్తున్నందున అభిమానులు వెండి తెరపై లెజెండ్ జయలలిత జీవితం లోని గొప్ప అనుభూతిని ఆస్వాధించగలరని సంతోషిస్తున్నాము. జయలలిత ఎప్పుడూ సినీ రంగానికి చెందినవారు.ఆమె కథను సజీవంగా తెరపైకి తీసుకురావడమే ఈ గొప్ప లెజెండ్ కి విప్లవ నాయకురాలికి నివాళి అర్పించడానికి ఏకైక మార్గం“ అని నిర్మాతలు తెలిపారు. ఇక తలైవి సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి ఆకట్టుకునే పోస్టర్లను విడుదల చేస్తుంది చిత్రయూనిట్.

తాజాగా తలైవి నుంచి అందమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. జయలలిత-ఎంజీఆర్ అప్పట్లో సూపర్ హిట్ రొమాంటిక్ పెయిర్. ఆ  ఇద్దరూ తమిళ క్లాసిక్స్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పోస్టర్ లో మరోసారి ఆరోజులను గుర్తు చేస్తూ డిజన్ చేశారు. జయలలిత-ఎంజీఆర్ పై అందమైన పాట సమయంలోని ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఈ ఫోటో చూస్తుంటే 60 – 70లలో పాటల శైలిని రొమాన్స్‌ని పోలి ఉంటుంది. అప్పటి వాతావరణం, ఆకాలం నాటి దుస్తులు అన్నీ అద్భుతంగా చూపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Seeti Maar: థియేటర్లలో సీటీ కొట్టే సమయం వచ్చేసింది.. గోపీచంద్‌ కొత్త చిత్రం విడుదల ఎప్పుడంటే.

తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు వారి అబ్బాయి..:Manchu Manoj Video.

Sridevi Soda Center: సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్.. విడుదల ఎప్పుడంటే..