Kalki 2898 AD: వెయ్యికోట్ల వసూళ్ల దిశగా కల్కీ.. సినిమాటిక్ యూనివర్స్‌ కమింగ్ సూన్‌

అదేదో యూరియా వాడితే చేనుకు చేవ- రైతుకు రొఖ్ఖం అన్నట్టు.. ఫిలిమ్ ఇండస్ట్రీక్కూడా మంచి బ్రాండెడ్ ఎరువు దొరికేసింది. అదే మైథాలజీ. పురాణ కథల్ని తెరకెక్కిస్తే సినిమాకు చేవ.. నిర్మాతకు కావల్సినంత రొఖ్ఖం గ్యారంటీ అన్నమాట. కంటెంట్ తక్కువై కథలకు కరువొచ్చిన కష్టకాలంలో.. దేవుళ్లనే నమ్ముకోవడం ఎప్పటినుంచో ఇండియన్ సినిమాకున్న అలవాటు. కానీ.. ఈ అలవాటును ఎప్పటికప్పుడు కొత్తగా ఎలా పాటించాలి అనేదే ఎదురయ్యే ఛాలెంజ్. ఆ ఛాలెంజ్‌ని విజయవంతంగా ఛేజ్ చేశారు డైరెక్టర్ నాగీ. పురాణ కథలకు అల్ట్రా మోడ్రన్ టచ్ ఇచ్చి సూపర్ విక్టరీ కొట్టింది కల్కి మూవీ..

Kalki 2898 AD: వెయ్యికోట్ల వసూళ్ల దిశగా కల్కీ.. సినిమాటిక్ యూనివర్స్‌ కమింగ్ సూన్‌
Kalki 2898 AD Movie
Follow us

|

Updated on: Jun 28, 2024 | 5:33 PM

బ్యాక్‌ టు బేసిక్స్ అన్నట్టు.. బ్యాక్‌ టు భారత, బ్యాక్‌ టు రామాయణం, మహాభారతం అంటూ వెనక్కే చూస్తున్నారు మన సినిమావాళ్లు. దేవుళ్లే కథావస్తువులుగా… పురాణాలే పంచభక్ష్య పరమాణ్ణాలుగా మారి.. ప్రేక్షకుడికి పసందైన వినోదాన్ని ఇస్తున్నారు. ఆమాటకొస్తే… బ్లాక్‌అండ్ వైట్ రోజుల్లోనే పురాణకథలతో అప్‌డేట్ ఆడియన్స్‌కి వింతైన వంటకాన్ని వడ్డించిన ఘనత మాయాబజార్ మేకర్స్‌దే.

మాయాబజార్ అంటే నథింగ్.. బట్ మహాభారతంలోని శశిరేఖా పరిణయం. అభిమన్యుడి పెళ్లి అనే ఘట్టానికి ముందూవెనుకా నేపథ్యాల్ని పెంచి.. కాసిన్ని హాస్యపు గుళికల్ని కలిపి.. మాయాబజార్ పేరుతో కళాఖండాన్ని సృష్టించారు దర్శక దిగ్గజం కేవీ రెడ్డి. మహాభారత కథల్ని ఇలా కూడా చెప్పొచ్చని.. బోరు కొట్టకుండా చాకచక్యంగా తెరకెక్కించవచ్చని అప్పట్లో చాటి చెప్పింది మాయాబజార్ సినిమా. దాదాపు 65 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు కల్కితో అటువంటి ఎక్స్‌పరిమెంటే చేసి మెప్పించారు నాగ్ అశ్విన్.

ఒకప్పుడు మైథలాజికల్ సినిమాలకు సీనియర్ ఎన్టీఆర్ పెట్టింది పేరు. రాముడు, రావణాసుడు, క్రిష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు.. ఇలా దేన్నీ వదలకుండా రామాయణ, మహాభారతాల్లోని అన్ని క్యారెక్టర్లలో నటించారాయన. తర్వాత పౌరాణిక పాత్రల్లో ఎన్టీయార్ వారసత్వాన్ని చాలామంది తీసుకున్నారు. బాల రామాయణం నుంచి సంపూర్ణ రామాయణం దాకా.. రామాయణం మీదే డజన్లకొద్దీ సినిమాలొచ్చాయి. ప్రేక్షక మహాశయులు కూడా బోర్ ఫీలవ్వకుండా ఆదరిస్తూ వచ్చారు. కానీ.. ఆడియన్స్‌ ఇప్పుడు సినిమాను చూసే తీరు మారింది. ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు పురాణాల్ని తెరమీద రీప్రొడ్యూస్ చేయడం మొదలైంది. కొత్త కథల్లేక కరువులో ఉన్న క్రియేటివ్ పీపుల్‌ని ఈవిధంగా పురాణ కథలే ఆదుకుంటున్నాయి. పురాణాల ప్రస్తావనలతోనే తమతమ సినిమాల్లో క్యారెక్టర్లను కొత్తగా డిజైన్ చేసుకుంటున్నారు దర్శకులు. ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైంది.

ఓ మై గాడ్ స్పూర్తితో తెలుగులో వచ్చిన గోపాలా గోపాలా మూవీకి.. పవన్‌కల్యాణ్ చేసిన క్రిష్ణ పరమాత్ముడి పాత్రే ప్రాణం పోసింది. సౌత్ ఇండియన్ ప్రౌడ్ ఐకాన్ మణిరత్నం పురాణాల రిఫరెన్సులతోనే తన సినిమాలకు కథలు రాసుకుంటారు. ధుర్యోధనుడు- కర్ణుడి స్నేహాన్ని దళపతిలో అద్భుతంగా చూపించారు. రావణ్‌లో సీతాపహరణం ఎపిసోడ్‌ని ఎంత డెప్త్‌గా చూపించారో… రోజా మూవీలో సీతమ్మ తల్లి పోరాట పటిమను అంతే ఎమోషనల్‌గా పండించారు. దటీజ్ మణిరత్నం అనిపించుకున్నారు.

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సైతం.. తన సినిమాల మూలాలు మహాభారతం నుంచే తీసుకుంటారు. పురాణాల ప్రస్తావన లేకుండా రాజమౌళి సినిమాలే లేవు. మహాభారతాన్ని ప్రాంచైజీగా తియ్యాలనేది దర్శకధీరుడు రాజమౌళి బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్. మహేష్‌బాబు సినిమా తర్వాత రాజమౌళి టేకప్ చేసే ప్రాజెక్ట్ మహాభారతమే కావొచ్చు. మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలొస్తాయని, దేవుడి కథలతో కూడిన జానర్‌.. మన సినిమాలకు మేజర్ కమర్షియల్‌ ఎలిమెంట్‌గా మారబోతోందని ఇటీవలే జక్కన్న జోస్యం చెప్పారు. దానికి తగ్గట్టే.. పాస్టు-ప్రజంటు, ఫ్యూచర్‌ అంతా రామమయం కృష్ణమయం అయ్యేట్టుంది.

కొత్త జనరేషన్ దర్శకులు కూడా ఎక్కువగా మైథాలజీ కథలపైనే ఫోకస్ చేస్తున్నారు. ఇటీవల తెరకెక్కి సౌత్‌ అండ్ నార్త్‌ అదరగొట్టిన హనుమ్యాన్.. అలా పుట్టుకొచ్చిందే. హనుమంతుడి అమరత్వం కాన్సెప్టుని వాడుకుని.. సోషియో ఫాంటసీ తీసి ఒక అద్భుతాన్నే సృష్టించాడు ప్రశాంత్ వర్మ. అదే మూవీలో విభీషణుడి పాత్రను కూడా చక్కగా పిక్చరైజ్ చేసుకున్నాడు. పౌరాణిక పాత్రల వాడకంలో ప్రశాంత్ వర్మ చూపించిన మెథడాలజీని అందరూ మెచ్చుకున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా మహాభారతాన్ని తనదైన శైలిలో గొప్పగా తెరకెక్కించమే తన అల్టిమేట్ డ్రీమ్ అని చెప్పుకున్నారు. రుద్రమదేవి, శాకుంతలం లాంటి ఎపిక్స్‌ని క్రియేట్ చేసిన డైరెక్టర్ గుణశేఖర్‌ కూడా రామాయణ-మహాభారతాల మీదే డిపెండవుతారు. జూనియర్ ఎన్టీయార్‌ని బాలరాముడిగా పరిచయం చేసి.. చిన్నారులతో ప్రయోగాత్మకంగా రామాయణ కావ్యాన్ని తెరకెక్కించిన ఘనత కూడా గుణశేఖర్‌దే.

దంగల్‌ మూవీతో బాహుబలి రేంజ్‌ కలెక్షన్లు రాబట్టిన దర్శకుడు నితీష్ తివారి కూడా.. ఈసారి రామాయణం మీదే దృష్టి పెట్టాడు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, కేజీఎఫ్ ఫేమ్ యశ్‌లతో అత్యంత భారీ బడ్జెట్‌తో రామాయణ గాధకు తెరరూపం ఇవ్వబోతున్నారు నితీష్ తివారి. రామాయణంలోని అరణ్యకాండను కొత్తగా చూపించాలన్న తాపత్రయంతో ఓం రౌత్ చేసిన ప్రయత్నం ఆదిపురుష్. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ.. ఆదిపురుష్ అనే ఎక్స్‌పరిమెంట్‌ మాత్రం ప్రశంసల్ని అందుకుంది. ఇప్పుడు కల్కి సినిమాకు మూలం కూడా మహాభారత కథే. అశ్వద్ధామ అమరత్వాన్ని ఆధునిక ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పి.. వావ్ అనిపించాడు డైరెక్టర్ నాగీ. కల్కి ఫ్రాంచైజీలో వచ్చిన తొలి భాగమే వెయ్యికోట్ల వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. సినిమాటిక్ యూనివర్స్‌ కమింగ్ సూన్‌.. అని సినిమా చివర్లో హింట్ ఇచ్చిన నాగీ.. ఫ్యూచర్ సినిమాకు ఒక మంచి చిట్కాను ప్రసాదించేశాడు. సో.. పౌరాణిక సినిమా అప్‌డేటెడ్ వెర్షన్స్‌ క్యూకట్టబోతున్నాయ్ అన్నమాట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..