హీరో అంటే.. ఫిట్నేస్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలంగా అందంగా కనిపించడమే కాకుండా.. హైట్.. వెయిట్ విషయంలోనూ చాలా శ్రద్ద చూపించాల్సి ఉంటుంది. అందుకే సినీ పరిశ్రమలోని నటీనటులు తమ ఫిట్ నెస్ విషయలంలో అచితూచి వ్యవహరిస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు.. వ్యాయమాలు చేయడం.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం.. శరారీనికి ఎక్కువగా శ్రమ లేకుండానే.. తమ ఫిట్ నెస్ కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇక మన టాలీవుడ్లో హీరోల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. తారక్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సినిమా సినిమాకు తారక్ స్టైల్ సులువుగా మారపోతుంది. ఎన్నో చిత్రాల్లో లవర్ బాయ్‌గా… మరికొన్ని చిత్రాల్లో మాస్ హీరోగా కనిపిస్తుంటారు.
ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్.. కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు.. ఈ సినిమా గురించి తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈరోజు విడుదలైన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇందులో తారక్ లుక్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటికే ఎన్టీఆర్‌కు సంబంధించిన పోస్టర్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చాలా భారీ కసరత్తులు చేశారు. ఎన్టీఆర్ వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతగా కష్టపడ్డాడో తెలుస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో తారక్ జిమ్‌లో తన కాళ్లతో హెవీ వెయిట్లను ఎత్తుతూ కసరత్తులు చేస్తుంది. చివరకు తన ఆ బరువు భరించకపోవడంతో తన ఫిట్‌నెట్ ట్రైనర్ సహయం తీసుకున్నాడు. ఈ వీడియోను తారక్ ఫిట్ నెట్ ట్రైనర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.
Samantha: ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..