Devara: ఫ్యాన్స్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..

|

Aug 27, 2024 | 4:57 PM

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురానున్నారు కొరటాల శివ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Devara: ఫ్యాన్స్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..
Devara
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురానున్నారు కొరటాల శివ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా చుట్టమల్లే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటుంది.

ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది దేవర సినిమా. ఈ లోగా చిత్రయూనిట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఊహించని ట్రీట్ ఇచ్చారు. దేవర మూవీ నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ది ఫేసెస్ ఆఫ్ ఫియ‌ర్’ అని దానికి క్యాప్ష‌న్ తో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

అయితే ఈ పోస్టర్ చూసిన తర్వాత ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారా.? అనే అనుమానాలు మొదలయ్యాయి. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దేవర సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. మరాఠీ నటి శ్రుతి మరాఠే రెండో హీరోయిన్ గా చేస్తుందని అంటున్నారు. దాంతో ఈ అమ్మడు ఎవరు అంటూ సోషల్ మీడియాను గాలిస్తున్నారు ఫ్యాన్స్. కాగా దేవర సినిమా రిలీజ్ కు సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉంది. దాంతో ఈ యూవీ ప్రమోషన్స్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. దేవర సినిమాలో బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయారాసన్, మురళీ శర్మ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.