Jr.NTR: ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. ఆర్ఆర్ఆర్ లాగే హృతిక్, ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్.. థియేటర్లలో దద్దరిల్లాస్సిందే

|

Jan 14, 2025 | 11:22 AM

ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ తర్వాత గతేడాది దేవర సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మాస్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి త్వరలోనే సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Jr.NTR: ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. ఆర్ఆర్ఆర్ లాగే హృతిక్, ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్.. థియేటర్లలో దద్దరిల్లాస్సిందే
Jr.ntr, Hrithik Roshan
Follow us on

ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డ్ అందుకుంది. ఇందులో చరణ్, తారక్ ఎనర్జీ స్టెప్పులు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఈ పాటకు వరల్డ్ వైడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్స్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే.. దేవర సక్సెస్ తర్వాత తారక్ వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. వార్ 2 చిత్రంలో బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ సైతం నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

హృతిక్ రోషన్ అద్భుతమైన డ్యాన్సర్ అని అందరికీ తెలిసిందే. ‘ధూమ్ 2’ సినిమాలో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు వార్ 2 సినిమాలోనూ అద్భుతమైన స్టెప్పులతో ఆకర్షించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో మల్టీస్టారర్ డ్యాన్స్ ఉంటుందట. హృతిక్, తారక్ ఇద్దరితోనూ ఓ సాంగ్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో సూపర్ హిట్ సాంగ్ లోడింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ పక్కా మరో ఆస్కార్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సాంగ్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. వీరిద్దరూ యాక్షన్‌తో పాటు డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హృతిక్ రోషన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అంటే సౌత్ లో పాపులర్. ఇప్పుడు వీరిద్దరూ కొత్త సినిమా కోసం రానుండడం విశేషం. వార్ సినిమా ఇప్పటికే భారీ విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకువస్తున్నారు మేకర్స్.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..