Jathi Ratnalu Movie : జాతి రత్నాలు’ టీజర్ రిలీజ్.. నవ్వులు పంచుతున్న స్టార్ కమెడియన్స్..

Jathi Ratnalu Movie : జాతి రత్నాలు సినిమా టీజర్ విడుదలైంది. ఖైదీల వేషంలో ఉన్న స్టార్ కమెడియన్స్ నవ్వులు పంచుతున్నారు.

Jathi Ratnalu Movie : జాతి రత్నాలు టీజర్ రిలీజ్..  నవ్వులు పంచుతున్న స్టార్ కమెడియన్స్..

Updated on: Feb 12, 2021 | 5:41 PM

Jathi Ratnalu Movie : జాతి రత్నాలు సినిమా టీజర్ విడుదలైంది. ఖైదీల వేషంలో ఉన్న స్టార్ కమెడియన్స్ నవ్వులు పంచుతున్నారు. నవీన్‌ పోలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్‌ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది.

ముగ్గురు యువకుల జీవితంలో ‘లైఫ్‌ అండ్‌ డెత్‌’ పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏంటి? దాన్ని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? చివరకు ఆ సమస్య నుంచి బయట పడ్డారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అప్పటివరకూ ఆసక్తికరంగా, నవ్వులు పంచుతూ సాగిన ఈ టీజర్‌ను మీరూ చూసేయండి. స్వప్న సినిమాస్‌ పతకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తున్నారు. రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 11న ‘జాతి రత్నాలు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ అదిరిపోవడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘సర్కారు వారి’ సాంగ్స్‌పై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్‌.. ‘అదిరిపోయే మ్యూజిక్ ఆన్ ది వే’ అంటూ పోస్ట్..