Pawan Kalyan Movie: పవన్‌, క్రిష్‌ సినిమాలో మరో హీరోయిన్‌… లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీలంక బ్యూటీ..?

|

Feb 04, 2021 | 5:50 AM

Jacqueline In pawan kalyan movie: 'అజ్ఞాత వాసి' తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ అనంతరం రాజకీయాల్లో బిజీగా మారారు. ఇక ప్రస్తుతం మళ్లీ సినిమాలు మొదలు పెట్టిన పవన్‌ వరుస సినిమాలకు ఓకే చెప్పిన..

Pawan Kalyan Movie: పవన్‌, క్రిష్‌ సినిమాలో మరో హీరోయిన్‌... లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీలంక బ్యూటీ..?
Follow us on

Jacqueline In pawan kalyan movie: ‘అజ్ఞాత వాసి’ తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ అనంతరం రాజకీయాల్లో బిజీగా మారారు. ఇక ప్రస్తుతం మళ్లీ సినిమాలు మొదలు పెట్టిన పవన్‌ వరుస సినిమాలకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు పవన్.
వీటిలో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారుతుతోంది. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోందని చిత్ర యూనిట్‌ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్‌ నటిస్తోందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం శ్రీలంకకు చెందిన ప్రముఖ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తీసుకోనున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. జాక్వెలిన్‌ ఇందులో డిఫ్రెంట్‌ రోల్‌లో నటించనుందని సమాచారం. జాక్వెలిన్‌ ఇప్పటికే అడపాదడపా స్పెషల్‌ సాంగ్స్‌తో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఒక వేళ పవన్‌తో నిజంగానే ఈ చిన్నది జత కడితే టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు రావడం ఖాయం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Shwetha Bachan Coments: వదినలో ఆ ఒక్క విషయం నచ్చదంటున్న శ్వేతా బచ్చన్.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కామెంట్స్‌..