నా భార్య టాప్ హీరోలతో యాక్ట్ చేసింది.. ఆశ్చర్యపరిచే విషయం చెప్పిన గడ్డం నవీన్..

జబర్దస్త్ నవీన్ తన భార్య సినిమా ప్రస్థానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె బాలీవుడ్‌లో కాకుండా హిందీ సినిమా పరిశ్రమలో బాడీ డబుల్‌గా పనిచేశారని, మాధురీ దీక్షిత్, పూజా భట్, ఊర్మిళ, నమ్రతా శిరోద్కర్ వంటి ప్రముఖ హీరోయిన్లకు యాక్షన్ సీన్లు, బ్యాక్ షాట్లు చేశారని తెలిపారు. అలాగే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్లతోనూ పనిచేసినట్లు పేర్కొన్నారు.

నా భార్య టాప్ హీరోలతో యాక్ట్ చేసింది.. ఆశ్చర్యపరిచే విషయం చెప్పిన గడ్డం నవీన్..
Jabardasth Naveen

Updated on: Mar 29, 2026 | 4:58 PM

జబర్దస్త్ నవీన్  ఎప్పట్నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. తనకంటూ ఓ రోజు వస్తుందని వెయిట్ చేశారు. ఆయన అనుకున్నదే జరిగింది. జబర్దస్త్ ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఎటిక నవీన్ కాస్తా.. గడ్డం నవీన్‌గా పాపులర్ అయ్యారు. అయితే తాజాగా ఆయన ఓ ఇంట్రస్టింగ్ విషయం చెప్పారు. తన భార్య కూడా పెళ్లి కాకముందే సినీ ఇండస్ట్రీలో పని చేసినట్లు వివరించారు. జబర్దస్త్ నవీన్ తన భార్య సినిమా కెరీర్ గురించి తాజాగా వెల్లడించిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చాలా మంది తన భార్య బాలీవుడ్‌లో నటించారని అనుకుంటుంటారని, అయితే ఆమె బాలీవుడ్‌లో కాకుండా విస్తృతంగా సినిమా రంగంలో పనిచేశారని నవీన్ స్పష్టం చేశారు. ఆమె ప్రధానంగా ప్రముఖ నటీమణులకు బాడీ డబుల్‌గా సేవలు అందించారని తెలిపారు. నవీన్ మాటల ప్రకారం, ఆయన భార్య మాధురీ దీక్షిత్, పూజా భట్, ఊర్మిళ, నమ్రతా శిరోద్కర్ వంటి అనేక మంది ప్రముఖ హీరోయిన్లకు బాడీ డబుల్‌గా యాక్ట్ చేశారు. క్యారెక్టర్లకు అవసరమైన యాక్షన్ సీన్లను, అలాగే బ్యాక్ షాట్లను ఆమె పూర్తి చేసేవారని నవీన్ వివరించారు. హీరోయిన్లు తమ షాట్స్ పూర్తయిన తర్వాత వెళ్ళిపోతే, మిగిలిన హీరో క్లోజప్ లేదా యాక్షన్ షాట్లను తన భార్య చేసేవారని పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఆర్. మాధవన్, జాకీ ష్రాఫ్ వంటి టాప్ స్టార్లతోనూ ఆమె పనిచేసిన అనుభవం ఉందని నవీన్ వెల్లడించారు. ఈ సమాచారం ఆమె సినీ ప్రస్థానంపై కొత్త కోణాన్ని పరిచయం చేసింది.

Naveen With Family

Also Read: తెలంగాణలో దొరికే దీని జ్యూస్ తాగితే నూరేళ్లు బతుకుడు పక్కా.. 

Follow Us