
జబర్దస్త్ కొమరం అర్జున్ రెడ్డి చిత్రంలో కీలకమైన శివ పాత్రను పోషించే అవకాశాన్ని కోల్పోయిన విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో టీవీలో యాంకర్‌గా పనిచేస్తున్న కొమరం, హైదరాబాద్‌లోని లమకాన్ వద్ద జరుగుతున్న ఆడిషన్స్‌కు వెళ్లారు. అక్కడ దర్శకుడు సందీప్ వంగ కొమరం తెలంగాణ యాస, సహజసిద్ధమైన అభినయం, సమయస్ఫూర్తిని చూసి ముగ్దుడయ్యారు. శివ పాత్రకు అవసరమైన కన్నడ (తుళు) యాసపై అవగాహన ఉందని చెప్పడంతో, కొమరంను రాహుల్ రామకృష్ణ పోషించిన పాత్రకు ఎంపిక చేశారు. ఆడిషన్ కేవలం ఫోన్ ద్వారా చేసినట్లు తెలిపారు. అయితే, పాత్రకు పారితోషికం రూ.2,000 నుండి రూ.5,000 అడిగితే, నిర్మాతలు రూ.1,000 మాత్రమే ఇస్తామన్నారని.. ఈ విషయమై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందని తెలిపారు. ఈలోగా విజయ్ దేవరకొండ నటించిన పెళ్ళిచూపులు చిత్రం విడుదలై విజయం సాధించింది.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: మీ కోసమే అంటూ ప్రేమగా 8 నెలలు స్లో పాయిజన్ ఇచ్చింది.. డాక్టర్ మాటలు విని షాకయ్యా.. జేడీ చక్రవర్తి
ఆ తర్వాత అర్జున్ రెడ్డి నిర్మాణంలో ఆలస్యం జరగడంతో కొమరంకు డేట్లు ఇవ్వలేకపోయారు. దీంతో ఆయనకు ఆ పాత్ర దక్కలేదని, ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేసి విజయం సాధించాయని తెలిపారు. ఈ అవకాశాన్ని కోల్పోవడం పట్ల ఆయనకు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ చిత్రంలో నటించిన వారందరూ మంచి స్థాయిలో ఉన్నారని తెలిపారు. విజయ్ దేవరకొండ తండ్రితో తనకున్న స్నేహాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు..
కొమరం తన కెరీర్‌లో సరైన బ్రేక్ రానందుకు కొంత నిరాశను వ్యక్తం చేశారు. దాదాపు 42 చిత్రాలు చేసినా, తన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు. పరిశ్రమలో ప్రతిభతో పాటు పరిచయాలు కూడా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..
Jabardasth Komaram New
ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..