Jabardasth: తండ్రి వయసున్న వ్యక్తి అలా ప్రవర్తించాడు.. కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ నటి

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి.. వారికి ఎదురైనా చేదు అనుభవాల గురించి మాట్లాడారు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ విషయాలు చెప్పారు. మరికొంతమంది తాము అలాంటివి ఎదురుకోలేదు కానీ అన్ని చోట్ల ఈ సమస్య ఉంటుంది అని అన్నారు. ఇక కాస్టింగ్ కౌచ్ పై సింగర్ చిన్మయి లాంటి వారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు.

Jabardasth: తండ్రి వయసున్న వ్యక్తి అలా ప్రవర్తించాడు.. కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ నటి
Actress
Follow us

|

Updated on: Jul 06, 2024 | 12:37 PM

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు. చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి.. వారికి ఎదురైనా చేదు అనుభవాల గురించి మాట్లాడారు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ విషయాలు చెప్పారు. మరికొంతమంది తాము అలాంటివి ఎదురుకోలేదు కానీ అన్ని చోట్ల ఈ సమస్య ఉంటుంది అని అన్నారు. ఇక కాస్టింగ్ కౌచ్ పై సింగర్ చిన్మయి లాంటి వారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలో ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే అండగా నిలుస్తున్నారు కూడా.. ఇదిలా ఉంటే తాజాగా ఓ జబర్దస్త్ నటి కూడా కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయం చెప్పింది. ఆఫర్స్ కోసం కమిట్మెంట్ అడుగుతారు అని చెప్పి షాక్ ఇచ్చింది.

ఆమె మరెవరో కాదు రోహిణి.. ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తమ ప్రతిభను చాటుకొని ప్రేక్షకులను అలరిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో కమెడియన్స్ గా మగాళ్లు మాత్రమే కాదు.. ఎంతో మంది ఆడవారు కూడా తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కోవై సరళ, హేమ, సురేఖ వాణి, గీత సింగ్ ఇలా ఇప్పటికే చాలా మంది లేడీ కమెడియన్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు వారిలో రోహిణి ఒకరు. ప్రముఖ టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా రోహిణి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె తన చలాకీ తనంతో .. కామెడీ టైమింగ్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న రోహిణి..కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. సేవ్ ద టైగర్స్ సీరీస్, అలాగే హనుమాన్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా రోహిణి మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేసింది. కెరీర్ బిగినింగ్ లో ఆఫర్స్ కోసం చాలా మందికి దగ్గరకు వెళ్లానని ఆ టైం లో అసభ్యకరంగా ప్రవర్తించారు అని తెలిపింది. అలాగే కమిట్మెంట్ గురించి ఎక్కువగా అడిగే వారిని చెప్పుకొచ్చింది. అలాగే ఓసారి ఆడిషన్ కు వెళ్తే తన తండ్రి వయసున్న వ్యక్తి కూడా నాకేంటి అని అసభ్యకరంగా మాట్లాడాడు.. దాంతో ఆ సినిమాను రిజెక్ట్ చేశా అని తెలిపింది రోహిణి. అలా కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఎప్పుడూ తప్పుడు మార్గంలోకి  వెళ్ళలేదు అని చెప్పుకొచ్చింది రోహిణి.

View this post on Instagram

A post shared by Rohini (@actressrohini)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.