తన అందాల నదిలో కుర్రకారుని ముంచేస్తున్న గ్లామర్ డాల్ ఊర్వశి రౌతెలా.

Anil Kumar

06 October 2024

ఊర్వశి రౌతెలా.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు.!

ప్రస్తుతం టాలీవుడ్లో కూడా ఈ అమ్మడి పేరు బాగా వినిపిస్తోంది. వరస అవకాశాలతో గ్లామర్ షో తో దూసుకుపోతుంది.

సనమ్‌ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ-4, పాగల్‌ పంతీ, వర్జిన్‌ భానుప్రియ సినిమాల్లో నటించి మెప్పించింది.

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ హరిద్వార్‌ ముద్దుగుమ్మ 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

మెగాస్టార్ చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా.

ఆ తర్వాత అక్కినేని అందగాడు యువ సామ్రాట్ అఖిల్ తో కలిసి ఏజెంట్ సినిమాలో స్టెప్పులేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల బాలీవుడ్ లో జేఎయూ అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస బిజిబిజీగా ఉంటోంది ఊర్వశి రౌతెలా.

ఇక తెలుగులో బాలయ్య చేస్తున్న NBK109 సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. దీంతో పాటు బ్లాక్ రోజ్ మూవీ చేస్తుంది.