మహేష్‌ని నమ్రత ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
06 October 2024
Basha Shek
టాలీవుడ్ లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ కపుల్స్ లో మహేశ్ బాబు- నమ్రతా శిరోద్కర్ ల జోడీ ఒకటి.
వంశీ చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.
ఆ స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. దీంతో ఇరు పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారీ లవ్లీ కపుల్.
సాధారణంగా ఇంట్లో కుటుంబ సభ్యుల ముద్దుపేర్లు చాలా ఉంటాయి. అలా మహేష్‌కి కూడా నమ్రత అలాంటి రొమాంటిక్ పేరే పెట్టింది.
కాగా మహేష్‌ని ఇంట్లో అంతా నాని అని పిలుస్తారట. అయితే ఇది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే.
ఇక నమ్రత అయితే మహేశ్‌ని ముద్దుగా 'బేబీ' అని పిలుస్తారట. ఒక సందర్భంలో నమ్రతనే ఈ విషయం బయటకు చెప్పేసింది.
కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.
అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచెరస్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..