నీ నవ్వులే వెన్నెలని.. గుర్తు చేస్తున్న మల్లీశ్వరి.! కత్రినా న్యూ లుక్స్

Anil Kumar

06 October 2024

తెలుగులో మల్లీశ్వరిగా మెప్పించిన కత్రినా కైఫ్‌ ఇప్పుడు బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగొందుతోంది.

హిందీ పరిశ్రమలో వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తూ విజయాలు సొంతం చేసుకుంటోందీ బాలీవుడ్  అందాల తార.

బాలీవుడ్ లో సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తో కలిసి మరోసారి టైగర్‌ 3 సినిమాతో మన ముందుకు వచ్చింది కత్రినా.

తాజాగా ఈ మూవీ నుంచి లేకే ప్రభు కా నామ్‌ అనే పాట రిలీజ్‌ కాగా స్టెప్పులతో అదరగొట్టిందీ స్టార్‌ హీరోయిన్‌.

ఇప్పటికీ టైగర్‌ 3 సంబంధించి కత్రినా కైఫ్‌ సాంగ్‌, డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

తాజాగా వీటిపై కత్రినా కూడా తనకు డ్యాన్స్‌ అంటే ఎంతో ప్రాణమని, జనాన్ని మెప్పించేందుకు ఎంత కష్టమైనా పడతానంది.

కత్రినా కైఫ్ తెలుగులో మల్లీశ్వరి అనే సినిమాలో నటించి.. ఆ తరువాత తెలుగు, హిందీ, మలయాళం చిత్రాల్లో నటించింది.!

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. తెలుగులో నటించి చాల కాలం అయినా క్రేజ్ మాత్రం అలానే ఉంది.