Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా?

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించి టాక్సిక్ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ను చూసి అభిమానులు వెర్రెక్కిపోతున్నారు. టీజర్స్, ట్రైలర్సే ఇలా ఉంటే మొత్తం సినిమా ఎలా ఉంటుందోనంటూ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.

Toxic Movie: యశ్ టాక్సిక్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా?
Toxic Movie

Updated on: Aug 11, 2026 | 8:59 PM

కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఏకంగా ఐదు గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ యశ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పాటలు, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు యశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే టాక్సిక్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. టాక్సిక్ సినిమా కథని మొదట ఒక స్టార్ హీరోకి వినిపించారట దర్శక నిర్మాతలు. కానీ ఆయన ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదట. దీంతో ఫైనల్ గా యశ్ ను తీసుకున్నారట.

టాక్సిక్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ సూర్య అని తెలుస్తోంది. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు మోతాదుకు మించి ఉండడం, అలాగే యాక్షన్ సీక్వెన్సులు కూడా భారీగా ఉండడంతో సూర్య ఈ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇప్పుడీ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ సహా పలువురు విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా సంగీతం అందిస్తున్నారు. కొన్ని పాటలకు విశాల్ కూడా సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

 

టాక్సిక్ సినిమాలో యశ్, కియారా అద్వానీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us