Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు

బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తుంది అందాల భామ రష్మీ గౌతమ్. పలు టీవీషోలతో ఆకట్టుకుంటూనే వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటుంది.

Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు
Rashmi Gautam

Updated on: Jan 25, 2022 | 8:45 AM

Rashmi Gautam: బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తుంది అందాల భామ రష్మీ గౌతమ్(Rashmi Gautam). పలు టీవీషోలతో ఆకట్టుకుంటూనే వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది రష్మీ. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.రష్మీ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. గతంలో రష్మీ -సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) లవ్ అంటూ ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా రూమర్స్ వచ్చాయి. తాజాగా రష్మీ పెళ్లి అయ్యిందంటూ టాక్ నడుస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలోనే రష్మీ సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందనే వార్త షికారు చేస్తుంది. అయితే  రష్మీ  ఎవరిని పెళ్లి పెళ్లాడిందో కూడా చెప్పుకుంటున్నారు.

రష్మీ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాదని అంటున్నారు. అతను ఓ ప్రైవేట్‌ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నాడట. లాక్ డౌన్ సమయంలో ఈ ఇద్దరు వివాహం చేసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే రష్మీ నివాసం ఉంటోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే కెరీర్ పరంగా ఎలాంటి ఇబబందులు రాకుండా ఉండేందుకే తనకు పెళ్లి అయ్యిందన్న విషయాన్నీ రష్మీ దాస్తుందని అంటున్నారు. గతంలో రష్మీ- సుడిగాలి సుధీర్ ప్రేమలో ఉన్నారని.. చాలా వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై ఇద్దరూ స్పందిస్తూ.. మామధ్య ఏమీ లేదు అని తేల్చి చెప్పారు. కేవలం కెమెరా ముందే అలా నటిస్తాం.. అంతకుమించి మా మధ్య ఏం లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా రష్మీ మ్యారేజ్ మ్యాటర్ చక్కర్లు కొడుతుంది. మరి ఈ విషయం పై రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut: మన హీరోలను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ బ్యూటీ.. కానీ హిందీ హీరోలను మాత్రం..

Pragya Jaiswal: సల్మాన్ తో రొమాంటిక్ సాంగ్ చేశా.. ఆయన్ని మొదట ఏం అడిగానంటే.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రగ్య

Ram Gopal Varma: అసాధారణ శక్తికి ఆదిపరాశక్తి తోడైతే.. వాయిస్ ఓవర్ తో అదరగొట్టిన ఆర్జీవీ.. కొండా మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్..