Irumudi Komaram: కొట్టినా తిట్టినా ఆయన నాకు అన్నం పెట్టాడు.. ఆ జబర్దస్త్ టీమ్ లీడర్‌ చాలా గొప్పోడంటోన్న కొమరక్క

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఈ మూవీ రిలీజై దాదాపు 10 రోజులు గడిచినా హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Irumudi Komaram: కొట్టినా తిట్టినా ఆయన నాకు అన్నం పెట్టాడు.. ఆ జబర్దస్త్ టీమ్ లీడర్‌ చాలా గొప్పోడంటోన్న కొమరక్క
Irumudi Actor Komaram

Updated on: Aug 31, 2026 | 6:17 PM

తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి ప్రభంనం కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజై పది రోజులు గడిచిపోయినా సరే ఈ సినిమా జోరు తగ్గడం లేదు. రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతున్నాయే తప్ప అసలు తగ్గడం లేదు. వీకెండ్ తో పాటు వీక్ డేస్ లోనూ రవితేజ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తుండడం విశేషం. ఇప్పటివరకు ఈ సినిమాకు సుమారు రూ.180 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషనల్ థ్రిల్లర్ సినిమాలో రవితేజ సరసన ప్రియాభవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ నటుడు సాయి కుమార్ మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. రవితేజ కూతురు పాత్ర లో మణెమ్మగా బేబీ నక్షత్ర నటన సినిమాలో మరో హైలెట్ అని చెప్పవచ్చు. వీరితో పాటు శ్వాసిక, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, లక్ష్మణ్ మీసాల, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు. కాగా జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్పులు వేసుకునే కొమరం అలియాస్ కొమరక్క ఇరుముడి సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. విలన్ షేడ్స్ ఉన్న నాగులు అనే నెగెటివ్ రోల్ లో భయపెట్టాడు. సినిమాలో నాగులు పాత్రకు కూడా మంచి పేరు రావడంతో సంతోషంతో తెగ ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడీ జబర్దస్త్ కమెడియన్. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కొమరం. తను పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన తోటి జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు కొమరం.

‘కిర్రాక్ ఆర్పీ అన్నకి చాలా థాంక్స్. ఆయన కొట్టినా.. తిట్టినా.. మంచోడో.. చెడ్డేడో పక్కనపెడితే.. నాకు అన్నంపెట్టిన మనిషి. కిర్రాక్ ఆర్పీ వల్లే నాకు మంచి పేరు వచ్చింది. ఆయన టీం లీడర్‌గా ఉండి.. నా మీదే దాదాపు నాలుగేళ్లు కంటెంట్ రాశాడు. ‘పశువులంటే ప్రాణం’ స్కిట్ పురుడు పోసుకున్నది ఆర్పీ అన్న దగ్గరే. అన్నం తినకపోతే తిట్టి మరీ పెట్టేవాడు. సాధారణంగా జబర్దస్త్ లో ఎవరి టీం వాళ్లకి అన్నం పెట్టడానికే ఆలోచిస్తారు. కానీ ఆర్పీ అన్న మాత్రం పక్క టీం వాళ్లని కూడా పిలిచి మరీ కడుపు నిండా అన్నం పెడతాడు. పొరపాటున డబ్బులు అడగడం మర్చిపోతే.. ఏరా డబ్బులు ఎక్కువయ్యాయా? కొట్టాను చూడు నీ పైసలు నీకు అని చెప్పి మరీ మనీ ఇచ్చేవాడు. మనీ కానీ.. ఫుడ్ పెట్టే విషయంలో కానీ అలాగే అవకాశాలు ఇచ్చే విషయంలో ఆర్పీ అన్న తోపు. ఆయన పర్సనల్ విషయాలు నాకు అనవసరం. పాలిటిక్స్ చేస్తున్నాడా? లేదా అన్నది కాదు. నాతో ఎలా ఉన్నాడు అన్నదే నాకు ముఖ్యం. ఆర్పీ మీ గురువు కదా.. అట్టా ఎట్టా మాట్లాడతాడు అని వేరే వాళ్లు ఎవరైనా నన్ను అడిగితే.. కచ్చితంగా వాళ్లని తిడతా. ఎందుకంటే అది ఆయన పర్సనల్. నాకు సంబంధం లేదు. నా కు లైఫ్ ఇచ్చాడు.. అన్నంపెట్టాడు.. అది చాలు నాకు. జబర్దస్త్ లో నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్లు ఉన్నారు. అలాగే మంచిగా చూసుకున్నోళ్లు ఉన్నారు. కాబట్టి మంచి చేసిన వాళ్ల గురించే మాట్లాడతా.. ఇప్పుడు ఇరుముడి సినిమాతో మంచి పేరు వచ్చింది కాబట్టి.. ఆ హ్యాపీలో ఉన్నాను’ అని చెప్పుకొచ్చారు కొమురం. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఇరుముడి సినిమాలో కొమరం..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us