టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డు చెప్పింది.. కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డు చెప్పింది.. కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది
Chiranjeevi

Updated on: Jun 02, 2026 | 4:58 PM

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌కు పునాది వేసిన సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ఒక అరుదైన విజయగాథ. 1982 ఏప్రిల్ 23న విడుదలైన ఈ సినిమా, నారాయణగూడ శాంతి థియేటర్‌లో ఏకంగా 525 రోజులు ఆడి ఒక అపురూపమైన రికార్డును నెలకొల్పింది. చిల్లగట్టు శ్రీకాంత్ ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను, అప్పటి పరిస్థితులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి ఇంజనీర్ రాజశేఖర్ పాత్ర పోషించగా, గొల్లపూడి మారుతీరావు టైటిల్ రోల్ సుబ్బారావు గా నటించారు. వాస్తవానికి, గొల్లపూడి మారుతీరావు చిరంజీవి నటించిన పలు చిత్రాలకు మాటలు రాశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో గొల్లపూడి నటించారని తెలిసినప్పుడు చిరంజీవి స్వయంగా ఆశ్చర్యపోయారట. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ సమయంలో, చిరంజీవి ఒక లాంచీలో కూర్చుని నారింజ తొనను విసురుతూ, అది నోట్లో పడితే సినిమా హిట్, లేకపోతే ఫట్ అని కోడి రామకృష్ణతో సరదాగా చెప్పిన సంఘటన గుర్తుచేసుకున్నారు.

చిరంజీవి డాన్స్‌కు ఈ సినిమా ఒక నిదర్శనం.. వచ్చే వచ్చే వానజల్లు పాటలో చిరంజీవి డాన్స్ ఆయన స్వయంగా డాన్స్ కంపోజ్ చేసుకున్నారు. చిరంజీవికి వైట్ కలర్ ప్యాంట్ సెంటిమెంట్ కూడా అప్పటినుంచే మొదలైందని గుర్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణం అనంతరం సెన్సార్ బోర్డుతో అనేక సమస్యలు తలెత్తాయి. సుబ్బారావు పాత్రకు సంగీత దర్శకుడు జె.వి.రాఘవులు జై జగదీశ హరే అనే భక్తి గీతాన్ని నేపథ్య సంగీతంగా ఉపయోగించడంపై సెన్సార్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దాసరి నారాయణరావు, డి.వి.ఎస్.రాజు వంటి సినీ ప్రముఖులు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. సినిమా టైటిల్ మార్చి “ఇంట్లో సుబ్బయ్య, వీధిలో దిబ్బయ్య” వంటి పేర్లు పెట్టమని సెన్సార్ అధికారి సూచించారట.

అనేక అడ్డంకులను అధిగమించి విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది. మహిళల కోసం ప్రత్యేకంగా మ్యాట్నీ షోలు ప్రదర్శించడం ఈ సినిమా విశేషం. అదే ఏడాది జులై 9న విడుదలైన దాసరి నారాయణరావు బొబ్బిలి పులితో పోటీ పడి కూడా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మంచి విజయాన్ని అందుకుంది. వంద రోజుల వేడుకల్లో దాసరి నారాయణరావు చేతుల మీదుగా చిరంజీవి షీల్డ్ అందుకున్నారు చిరంజీవి. చిరంజీవి కేవలం రెమ్యునరేషన్‌తో సంబంధం లేకుండా పాత్రకు పూర్తి న్యాయం చేస్తారని ఈ సినిమా నిరూపించింది. ఈ చిత్రం తర్వాత శుభలేఖ, రాధ మై డార్లింగ్, బంధాలు అనుబంధాలు, మంచు పల్లకి వంటి కుటుంబ కథా చిత్రాలకు ఇది ఆలంబనగా నిలిచింది. గొల్లపూడి మారుతీరావు, కోడి రామకృష్ణ, కే.రాఘవ వంటి ప్రముఖులు ప్రస్తుతం లేకపోయినా, వారి కృషి వల్ల తెలుగు సినిమా చరిత్రలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఒక చెరిగిపోని అధ్యాయంగా నిలిచిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us