Ippudu Kaka Inkeppudu: విడుదలకు ముందే చిత్రయూనిట్‏కు షాక్.. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..

|

Aug 04, 2021 | 9:31 AM

ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రయూనిట్‏కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షాకిచ్చారు. విడుదలకు ముందే ఈ సినిమాపై కేసు నమోదు చేశారు.

Ippudu Kaka Inkeppudu: విడుదలకు ముందే చిత్రయూనిట్‏కు షాక్.. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..
Ippudu Kaka Inkeppudu
Follow us on

ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రయూనిట్‏కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షాకిచ్చారు. విడుదలకు ముందే ఈ సినిమాపై కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏లో హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఉందని పేర్కొంటూ ఆన్‏లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు 67 ఐటీ యాక్ట్, 295 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నూతన దర్శకుడు యుంగధర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ట్రైలర్‏పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

 

ఇందులోని పాటలు, సీన్లు, డైలాగులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో వ్యక్తిరేకత వచ్చింది. అందులోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని పలువురు చిత్రయూనిట్‏ను హెచ్చరించారు. హీరోహీరోయిన్లకు సంబంధించిన సన్నివేశంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్‏గా ఓ భక్తి గీతాన్ని వినిపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్రైలర్ వీక్షించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మూవీ టీంపై సుమటోగా కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే చిత్రయూనిట్‏కు నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలిపారు. అయితే సినిమా పై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై డైరెక్టర్ స్పందించాడు. సినిమా విషయంలో మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు.

Also Read: Sathiyam Tv: సత్యం టీవీ ఛానెల్‏పై దాడి చేసిన ఆగంతకుడు.. పోలీసుల అదుపులో నిందితుడు…

IND vs ENG, 1st Test Preview: టీమిండియా ఓపెనింగ్‌పై నెలకొన్న ఆసక్తి.. నేటినుంచి ఇంగ్లండ్‌తో తొలిటెస్ట్.. ఇరు జట్ల రికార్డులు, బలాలు ఇవే..!

Google Pixel 6: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌లో అదిరిపోయే ఫీచర్స్‌.. వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా..టెలిఫొటో షూటర్!

Andhra Pradesh: ప్రమోషన్ అంటూ పార్టీ ఇస్తాడు.. ఆపై అందినకాడికి దోచుకెళ్తాడు.. వీడి మోసాలు అన్నీఇన్ని కావు..