ఈ మధ్య కాలంలో కుర్రాళ్లను పిచ్చెక్కించిన సాంగ్ ఏదైనా ఉందా అంటే.. అది పుష్ప మూవీలోని ‘ఊ.. అంటావా.. ఊహూ అంటావా మామ’. లిరికల్ సాంగ్ చూసినప్పడే సామ్ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ప్రోమో వదిలిన తర్వాత పిచ్చెక్కిపోయారు. ఇక థియేటర్‌లో సాంగ్ చూస్తున్నప్పడు అయితే.. పరవశించిపోయారు. తెలుగులో సింగర్ ఇంద్రవతి చౌహాన్ వాయిస్ కూడా మత్తెక్కించేలా ఉండటం మరో ప్లస్ పాయింట్. తెలుగులోనే కాదు అన్నీ లాంగ్వెజస్ ఈ సాంగ్ ఆడియెన్స్‌ను ఒక ఊపు ఊపేసింది. పాటలో ఎక్స్‌పోజింగ్ ఎక్కువైందని కొందరు కామెంట్స్ చేసినా.. సామ్ లైట్ తీసుకుంది. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడమే తనకు ఇంపార్టెంట్ అని తెలిపింది. హాట్‌గా కనిపించడం అంత ఈజీ కాదని.. అందుకు చాలా కష్టపడాలని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇక తాజాగా తన పాట మీద వచ్చిన క్రేజీ మీమ్‌ను చూసి సమంత పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. నిజంగానే ఆ మీమ్ చాలా ఫన్నీగా ఉంది.
— Samantha (@Samanthaprabhu2) December 23, 2021
ఓ పాత పాట విజువల్స్‌ను, ఈ కొత్త పాట లిరిక్స్‌కు లింక్ కలిపి వదిలిన మీమ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ మీమ్ వీడియో సమంత కంట పడటంతో ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. నవ్వుతున్న ఎమోజీలతో ఈ వీడియోను ఆమె రీ ట్వీట్ చేశారు. వివాదాలు ఈ పాటను మరింత మందికి చేరువ చేయడానికి హెల్ప్ అయ్యాయి తప్పితే.. సాంగ్ క్రియేట్ చేస్తోన్న సంచలనాలను ఆపలేకపోయాయి.
Also Read: ‘డబ్బుపై ఆశతోనే..’ నాని కామెంట్స్‌పై ఘాటుగా రియాక్టయిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే విష్ణు..
జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!