Hero Surya: అదే దారిలో సూర్య పాన్ ఇండియా మూవీ కంగువ కూడా..

తమిళంతోపాటు.. తెలుగులోనూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ సిరుత్తే శివ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. సూర్య కెరీర్ లో 42 వ సినిమాగా వస్తోంది ఈ మూవీ. పీరియాడిక్ డ్రామాకా రూపొందుతున్న ఈ మూవీని దాదాపు పది భాషల్లో.. 2డీ, 3డీ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Hero Surya: అదే దారిలో సూర్య పాన్ ఇండియా మూవీ కంగువ కూడా..
Surya42

Updated on: Apr 30, 2023 | 8:06 AM

తమిళ్ స్టార్ సూర్య ఇప్పుడు హిస్టారికల్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూర్యకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు.. తెలుగులోనూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ సిరుత్తే శివ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. సూర్య కెరీర్ లో 42 వ సినిమాగా వస్తోంది ఈ మూవీ. పీరియాడిక్ డ్రామాకా రూపొందుతున్న ఈ మూవీని దాదాపు పది భాషల్లో.. 2డీ, 3డీ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో సూర్యకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం భారీ సినిమాలన్నీ రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బహుబలి సినిమా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా కూడా రెండు భాగాలు రానుంది.

ఇక ఇప్పుడు సూర్య సినిమా కూడా రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమాకు కంగువ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి..అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. ఈ సినిమా షూటింగ్ గోవా, చెన్నైతోపాటు పలు లొకేషన్లలో జరుగుతుంది. ఇప్పటికే 50 శాతం పూర్తయ్యింది. సూర్య చాలా గంభీరంగా కనిపించనున్నాడని తెలుస్తోంది.