Trivikram Srinivas: మహేష్ సినిమాకోసం మరోఅక్కినేని హీరోను తీసుకోనున్న మాటల మాంత్రికుడు..

టాలీవుడ్ లో మాటలమాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా ఉన్న త్రివిక్రమ్ ఆతర్వాత దర్శకుడిగా మారి..

Trivikram Srinivas: మహేష్ సినిమాకోసం మరోఅక్కినేని హీరోను తీసుకోనున్న మాటల మాంత్రికుడు..
Trivikram Srinivas

Updated on: May 15, 2021 | 2:50 PM

Trivikram Srinivas:

టాలీవుడ్ లో మాటలమాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా ఉన్న త్రివిక్రమ్ ఆతర్వాత దర్శకుడిగా మారి ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీ వ్యాల్యూస్, పంచ్ డైలాగ్స్ , ప్రాసలు గుర్తొస్తాయి. సింపుల్ కథను తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకుంటారు త్రివిక్రమ్.  ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. మహేష్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. అయితే ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో గురూజీ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మహేష్ తో సినిమాను అనౌన్స్ చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఈ వార్త ముఖ్యంగా హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే మహేష్ సినిమాలో మరోహీరో కూడా నటించనున్నాడట. మహేష్ త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ కీలక పాత్రలో నటించనున్నాడని ఫిలింనగర్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అలవైకుంఠపురంలో’ సినిమాలో అక్కినేని సుశాంత్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ లో కూడా కీలక పాత్రకోసం సుమంత్ ను ఎంపిక చేసాడట గురూజీ. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. అలాగే మే31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్- త్రివిక్రమ్ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

కొలిక్కిరాని ‘ఇండియన్ 2’ వివాదం.. శంకర్ మూవీ గొడవలో మరో మలుపు.. మరోసారి డైరెక్టర్‏కు షాకిచ్చిన నిర్మాణ సంస్థ..

మూడు సంవత్సరాల వయసులో నేర్చుకున్న నాట్యం.. తన జీవితాన్నే మార్చేసింది.. మాధురి దీక్షిత్ గురించి ఆసక్తికర విషయాలు..

Tollywood Heroines: సన్నజాజిలా మారాలన్న కసి.. జిమ్ లో కసరత్తులతో కష్టపడుతున్న వయ్యారి భామలు…

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us