Arvind Swami : దివంగత నేత, సీనీ నటి జయలలిత జీవిత కథ ఆదారంగా తెరకెక్కుతున్న సినిమా తలైవి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో జయలలిత పాత్రలో కంగనా నటించింది. అలాగే అలనాటి నటుడు, రాజకీయ నాయకుడు అయిన ఎంజీఆర్ క్యారెక్టర్‌లో విలక్షణ నటుడు అరవిద స్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా.. విబ్రి మీడియా- కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలకానుందని మొదటి నుంచి టాక్ వినిపించింది. ఇందుకోసం భారీ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ప్రకటించారు మేకర్స్. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.
తాజాగా అరవిద స్వామి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎంజీఆర్ పాత్రను చేస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ను ఎంతో మంది ప్రజలు అభిమానిస్తున్నారు. ఏ చిన్న తప్పు కూడా చేయకూడదు. ఇమిటేట్ చేస్తూ నటించడం అనేది మామూలు విషయం కాదు. ఆయన జీవితాన్ని కూడా అర్థం చేసుకోవాలి. స్క్రిప్ట్‌లోని ఎమోషన్‌కు కనెక్ట్ అవ్వాలి. బాడీ లాంగ్వేజ్‌ను మఅలవాటు చేసుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఎంజీఆర్ అంటే ఓ లెజెండ్. చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ నేను పెరిగాను. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందారు. ఆయన పాత్రను పోషించడం బాధ్యతగా ఫీలయ్యాను. ఎంజీఆర్ పాత్రను పోషించడం ఓ చాలెజింగ్ అనిపించింది.. అందుకే తలైవి సినిమాను చేశాను. ఈ సినిమాలో ఎంజీఆర్ గా నాలుగు షేడ్స్ లో కనిపిస్తాను అని చెప్పుకొచ్చారు అరవింద స్వామి.
మరిన్ని ఇక్కడ చదవండి :
బిగ్ బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే.? హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.!